
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. వచ్చే నెల మూడవ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నట్టు పేర్కొంది. రోజు ఉదయం 9 గంటలకు ఆలయం మూసివేయబడుతుందని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు గ్రహణం ఉంటుందని ఈ నేపథ్యంలో ఆ రోజులు పలు ఆర్జిత సేవలు, దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగానే ఆలయం తలుపులు మూసివేయడం అనేది ఎన్న ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఉదయం 9 గంటలకే ఆలయ తలుపులు మూసి వేయనున్నారు అర్చకులు. గ్రహణం వీడిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయాన్ని శుద్ధి, పుణ్యహవచనం చేస్తారు. అనంతరం రాత్రి 8:30 నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు అని టీటీడీ తెలిపింది. కాబట్టి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వీటిని దృష్టిలో ఉంచుకొని తమ యాత్ర ప్రణాళికను మార్చుకోవాలని టీటీడీ సూచించింది.
ఇదిలా ఉండగా అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయని, వాటికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అయితే తిరుమల శేషాచల అడవులలోని వాయవ్య దిశలో కొలువై ఉన్న పవిత్ర కుమారధార తీర్థం” వద్ద ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజున కుమారధారలో పవిత్ర స్నానం చేయడం వల్ల యవ్వనం, ఆయుష్షు రెండూ పెరుగుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముకం
మరిన్ని ఆథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.