పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు హారర్ కామెడీ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అదే రాజా సాబ్. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో డార్లింగ్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
డిసెంబర్ 5న రాజాసాబ్ సినిమాను విడుదల కానున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ లో ప్రభాస్ లుక్స్ మాములుగా లేవు.. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హారర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజా సాబ్ లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
ప్రభాస్ మొదటి సారి హారర్ కంటెంట్ ఉన్న కథతో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ టైమింగ్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజరే ఈ రేంజ్ లో ఉందంటే టీజర్ ఎలా ఉంటుందో.. అలాగే సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ది రాజా సాబ్ మూవీ నిర్మాత విశ్వప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజా సాబ్ రన్ టైం గురించి ఆయన మాట్లాడుతూ.. సినిమా మొత్తం నాలుగున్నర గంటలు వస్తుంది. దాన్ని ఎడిట్ చేసి 3 గంటలు లేదా 2.45 గంటలకు కుదించేలా ప్లాన్ చేస్తాం. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో ఈ సినిమాలో అన్ని ఉంటాయి అని చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్. ప్రభాస్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా రాజా సాబ్ నిలుస్తుందని ఆయన అన్నారు. దాంతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే కల్కి 2 సినిమాలోనూ నటిస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.