తాటిబెల్లంలోని ఖనిజాలు , లవణాలు చక్కెరతో పోలిస్తే 60 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. టీ, కాఫీ, పండ్లరసాలకు ఈ బెల్లాన్ని వినియోగించొచ్చు అంటున్నారు. జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.