Thammudu Movie Review: తమ్ముడు మూవీ రివ్యూ.. నితిన్ ఈసారి హిట్టు కొట్టాడా..?

Thammudu Movie Review: తమ్ముడు మూవీ రివ్యూ.. నితిన్ ఈసారి హిట్టు కొట్టాడా..?


మూవీ రివ్యూ: తమ్ముడు

నటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వస్తిక విజయ్, సౌరబ్ సచ్ దేవ్ తదితరులు

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సినిమాటోగ్రాఫర్స్: సమీర్ రెడ్డి, కె.వి గుహన్, సత్యజిత్ పాండే

సంగీతం: అజినీష్ లోక్నాథ్

నిర్మాత: శిరీష్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేణు శ్రీరామ్

నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు. వకీల్ సాబ్ తర్వాత వేణు తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన తమ్ముడు ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

జై (నితిన్) ఒక ఆర్చర్.. చిన్నప్పటి నుంచి కష్టపడి విలువిద్యలో శిక్షణ తీసుకుంటాడు. ఎలాగైనా దేశానికి గోల్డ్ మెడల్ తేవాలి అనేది జై కల. కానీ బుల్స్ ఐ కొట్టడంలో ప్రతిసారి మిస్ అవుతూ ఉంటాడు. మీలో ఏదో సమస్య ఉంది ముందుగానే పరిష్కరించుకున్న తర్వాత లక్ష్యం వైపు ఆలోచించు అని కోచ్ చెప్పిన మాటలు విన్న తర్వాత.. పరిష్కారం కోసం బయలుదేరుతాడు జై. అలా తన అక్క ఝాన్సీ (లయ)కు చిన్నప్పుడు చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. దాంతో అక్క దగ్గరికి బయలుదేరుతాడు తమ్ముడు. అతను వెళ్లేసరికి అక్క కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకొని.. ఆమె ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని సైతం ఫణంగా పెడతాడు. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది మిగిలిన కథ..

కథనం:

అక్క మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్లి ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ. మనిషిపోయి మాట బతికితే మనిషి బతికినట్టే.. అదే మాట పోయి మనిషి బతికినా కూడా మనిషి పోయినట్టే అనేది ఈ సినిమా లైన్. సింపుల్గా మూడే ముక్కల్లో చెప్పాలంటే ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ తో తప్పుడు సంతకాల కోసం విలన్ ఆడే ఒక క్రూర నాటకం ఈ సినిమా. ఆ సిన్సియర్ ఆఫీసర్ తమ్ముడు హీరో. అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది సినిమా కథ. వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తున్న కూడా స్క్రీన్ ప్లే వైస్ గా మ్యాజిక్ చేయాలి అనుకున్నాడు వేణు శ్రీరామ్. కానీ అది అసలు కుదరలేదు. తన గత సినిమాలలో కమర్షియల్ అంశాలు ఎక్కువగా చూపించిన వేణు.. తమ్ముడులో టెక్నికల్ పై ఫోకస్ చేశాడు. మ్యూజిక్ పరంగా ఈ సినిమా బాగుంది. నిర్మాత అబ్దుల్ రాజు చెప్పినట్టు మొదటి 15 నిమిషాల తర్వాత సినిమా మొత్తం ఒక రోజులో జరిగే కథ. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండాలి. కానీ ఆ విషయంలోనే వేణు శ్రీరామ్ పూర్తిగా మిస్ ఫైర్ చేశాడు. అక్క అనుకోకుండా ఒక ఊరికి వెళ్లడం.. అక్కడ ఆమె కొన్ని సమస్యలలో ఇరుక్కోవడం.. ప్రజలకు ఇచ్చిన మాట తీర్చకుండా ఉండడం.. ఆ విషయం తెలిసి తమ్ముడు అక్క మాట కోసం అదే ఊరికి వచ్చి ఆమె ఆశయాన్ని ఎలా తీర్చాడు.. ఇవన్నీ చాలా సినిమాలలో చూసిన విషయాలు. ఇందులో ఒక డైలాగు ఉంటుంది అనుగక్షతి ప్రవాహా అని.. అంటే గో విత్ ద ఫ్లో అని అర్థం. దారి ఎటు చూపిస్తే అటు వెళ్లిపో అని దాని మీనింగ్. కథ కథనాలు కూడా అలాగే వెళ్ళిపోయాయి.

నటీనటులు:

నితిన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఏ పాత్ర ఇచ్చినా కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే కథలు వర్కౌట్ కానప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు. హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్ర లయ పోషించింది. అక్క పాత్రకు ఆమె ప్రాణం పోసింది. మరో చిన్న పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తమ పాత్రలకు న్యాయం చేశారు. లేడీ విలన్ గా స్వస్తిక విజయ్ బాగుంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్ దేవ్ బాగా నటించాడు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు ప్రధానమైన బలం సంగీతం. అజనీష్ లోక్నాథ్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. పాటల కంటే ఎక్కువగా బ్యాగ్రౌండ్ స్కోరు విషయంలో ఎక్కువగా ఆకట్టుకున్నాడు అజినిష్. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎక్కువ భాగం సినిమా అడవిలోనే సాగుతుంది. అక్కడి అందాలను చాలా బాగా చూపించాడు సినిమాటోగ్రాఫర్స్ సమీర్ రెడ్డి, కె.వి గుహన్, సత్యజిత్ పాండే. ఎడిటర్ ప్రవీణ్ పూడి ఇంకాస్త కఠినంగా ఉండి కొన్ని సన్నివేశాలు తొలగించాల్సి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ కథ మాత్రమే కాదు.. స్క్రీన్ ప్లే కూడా పాతదే రాసుకున్నాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా తమ్ముడు.. బుల్స్ ఐ మళ్లీ మిస్సైంది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *