హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌లు గట్రా పాజిటీవ్ బజ్ క్రియేట్ చేశాయి. దీనికి తోడు మేకర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేప్టటారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (జూలై 4న) తమ్ముడు సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్అయ్యింది. కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే చిత్ర బృందం ఒక కీలక ప్రకటన చేసింది. సినిమాను టార్గెట్ చేస్తూ.. మూవీ ఎలా ఉన్నా కూడా నెటిగివ్‌గా ట్రోల్స్ చేస్తూ, సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది తమ్ముడు చిత్ర బృందం. ఈ మేరకు ‘తమ్ముడు’ సినిమాను దెబ్బతీసే ఉద్దేశ్యంతో అగౌరవపరిచే రివ్యూస్ ఇస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని నిర్మాతలు ముందుగానే హెచ్చరించారు. బాధ్యతాయుతమైన విమర్శలకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ సినిమాను కావాలని దెబ్బతీసే లక్ష్యంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని తమ్ముడు చిత్ర బృందం హెచ్చరించింది.
సీనియర్ హీరోయిన్ లయ సుమారు 18 ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. తమ్ముడు సినిమాలో ఆమె నితిన్ అక్కగా నటించింది. అలాగే స్వాసిక విజయ్ , వర్షా బొల్లమ్మ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. ఈ సినిమాను సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
అప్పుడు కన్నప్ప.. ఇప్పుడు తమ్ముడు..
BREAKING 🚨
Makers of #Thammudu has warned that disrespectful reviews intended to harm the film may face legal action.
They’re open to responsible criticism, but not abuse or targeted attacks.#Nithiin #ThammuduOnJuly4th pic.twitter.com/dEy2m82yLZ
— Movies4u Official (@Movies4u_Officl) July 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి