నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా శుక్రవారం (జులై 04)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అలాగే వర్ష బొల్లమ్మ, లయ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తమ్ముడు సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్, ట్రైలర్లు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించడంతో సినిమపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కాగా తమ్ముడు సినిమా నితిన్ కు చాలా కీలకం. ఎందుకంటే ఈ హీరో సక్సెస్ చూసి చాలా ఏళ్లైంది. కాబట్టి తమ్ముడు మూవీతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని నితిన్ చూస్తున్నాడు. అయితే తమ్ముడు సినిమాకు నితిన్ ను హీరోగా అనుకోలేదట. అందుకు ముందు న్యాచురల్ స్టార్ నానితో ఈ మూవీని తెరకెక్కించాలని డైరెక్టర్ భావించారట. అప్పటికే వీరి కాంబినేషన్ లో ఎమ్‌సీఏ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. కాబట్టి మరోసారి ఈ కాంబోను రిపీట్ చేయాలని దిల్ రాజు భావించారట. చివరకు నానికి కథను కూడా వినిపించారట. న్యాచురల్ స్టార్ కు కూడా ఈ సినిమా కథ బాగా నచ్చేసింది. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట. ఫలితంగా ఈ మూవీ కథ ఫైనల్ గా నితిన్ దగ్గరకు వెళ్లింది.
తమ్ముడు సినిమాను న్యాచురల్ స్టార్ నానితో తీద్దామనుకున్నట్లు దిల్ రాజు ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. కథ బాగుంది కాబట్టే నితిన్ ను హీరోగా ఎంచుకుని భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించామని ఆయన పేర్కొన్నారు. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. సౌరభ్ సచ్‌దేవా, స్వాసిక , హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితర ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ అందించగా , సినిమాటోగ్రాఫర్ ఆ కెవి గుహన్ వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి
A SURREAL BATTLE FOR SURVIVAL 💥
Experience the blasting and adrenaline-pumping #VibeOfThammudu ❤️🔥#Thammudu Release Trailer
▶️ https://t.co/e9YyFIhnOe#ThammuduOnJuly4th 🎯@actor_nithiin #SriramVenu #Laya @gowda_sapthami #SaurabhSachdeva @VarshaBollamma #Swasika @AJANEESHB… pic.twitter.com/RYYd8JBWi5— Sri Venkateswara Creations (@SVC_official) July 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.