TG High Court Jobs 2026: 7వ తరగతి, టెన్త్‌ అర్హతతో జిల్లా కోర్టుల్లో ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే

TG High Court Jobs 2026: 7వ తరగతి, టెన్త్‌ అర్హతతో జిల్లా కోర్టుల్లో ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర హైకోర్టు (TGHC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 43 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 34, డ్రైవర్‌ పోస్టులు 9 చొప్పున ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 7, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి 7వ తరగతి, పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డ్రైవర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి జులై 1, 2026వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు ఐదేళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. డ్రైవర్‌ పోస్టులకైతే రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు రూ.19,000 నుంచి రూ.58,850 వరకు జీతంగా చెల్లిస్తారు. డ్రైవర్‌ పోస్టులకు నెలకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఇవి కూడా చదవండి

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఆఫీస్‌ సబార్డినెట్, డ్రైవర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *