పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి.. తెలుగులో క్రేజీ హీరోయిన్. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెప్పించింది. విభిన్న కంటెంట్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అంజలి. నిజానికి తెలుగమ్మాయే అయినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. నటిగా ప్రశంసలు సొంతం చేసుకుంది.
షాపింగ్ మాల్ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో తెరంగేట్రం చేసిన అంజలి.. తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత జర్నీ సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేశ్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గానూ అలరిస్తుంది. అలాగే పాత్ర ప్రాధాన్యత బట్టి విభిన్నమైన మూవీస్ చేసేందుకు ముందుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న అంజలి..నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు. తాజాగా గ్రీన్ కలర్ శారీలో మరింత మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఇప్పుడు మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ.