వృషభం: ఈ రాశికి అష్టమంలో ఉన్న చంద్రుడిని ఏకంగా నాలుగు గ్రహాలు వీక్షించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో రావలసిన డబ్బును, బాకీలను రాబట్టుకో వడం జరుగుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదవీ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆస్తి, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.