తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET-2026) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్లో ప్రభుత్వం ఫలితాలను అందుబాటులో ఉంచింది. టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యశాఖ పోర్టల్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్‌సైట్లోకి వెళ్లి హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి చూసుకోవచ్చు.