N. Ramachandra Rao
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఏబీవీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మన్నగూడలో జరిగే సన్మాన సభలో రాంచందర్ రావును అధ్యక్షుడిగా సంస్థాగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన్నేడలో ఏర్పాటు చేసిన స్మాన సభకు భారీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. వీరితో పాటు తెలంగాణ కీలక బీజేపీ నేతలు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
ఈ క్రమంలో ర్యాలీగా కార్యకర్తలతో కలిసి వేద కన్వెన్షన్ కు చేరుకున్న నూతన అధ్యక్షుడు రాంచందర్ రావుకు కేంద్రమంత్రలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు. నూతన అధ్యక్షుడికి శూభాకాంక్షలు తెలియజేశారు. కాసేపట్లో సంస్థాగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును ప్రకటించనున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.