Telangana: స్తంభం ఎక్కిన నాగుపాము… ఆ కుటుంబానికి లక్షల నష్టం.. ఏం జరిగిందటే..?

Telangana: స్తంభం ఎక్కిన నాగుపాము… ఆ కుటుంబానికి లక్షల నష్టం.. ఏం జరిగిందటే..?


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం ఘటనకు కారణం ఓ నాగుపాము అంటే నమ్ముతారా..?.  అవును పాము రూపంలో వచ్చిన ప్రమాదం ఆ కుటుంబాన్ని నిరాశ్రయులను చేసింది.. దుస్తుల షాపు మొత్తం ఖాళీ బూడిదై కుటుంబమంతా రోడ్డున పడింది.. పాము వల్ల సంభవించిన విద్యుత్ షాక్ సర్క్యూట్ గురించి తెలిసిన గ్రామస్తులు.. దాని పగే కారణం అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే… టేకుమట్ల మండలం కేంద్రంలోని మారుతి ఫ్యాషన్స్ షాపు నిర్వాహిస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఎప్పటిలాగే తన బట్టల షాప్ మూసేసిన తర్వాత అతను ఇంటికి వెళ్ళాడు.. అయితే సాయంత్రం వేల సమీపంలోని విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన నాగుపాము ఎక్కింది. అది రెండు వైర్లను తాకడంతో కాలిపోయింది.. ఈ క్రమంలో జే వైర్‌కు పాము చుట్టుకొని ఉండడంతో బట్టల షాప్‌లోని వైర్‌కు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది.. షాప్ లోపల మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో షాపులోని వస్త్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.. షాపు దగ్ధమైంది.. 14 ఏళ్ల కష్టార్జితం నాగుపాము రూపంలో కాలి బూడిదయిపోవడంతో ఆ కుటుంబం లబోదీబోమంటున్నారు.

షాప్ మంటల్లో దగ్దం అవుతున్న విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బందికి వెంటనే స్పందించారు..వారు వచ్చి మంటలు అదుపుచేసే లోపే పూర్తిగా షాపు దగ్ధమైపోయింది.. అందులోని వస్త్రాలు నగదు కాళీ బూడిదయ్యాయి.  షాపులో విద్యుత్ షాక్ సర్క్యూట్ ఎలా సంభవించింది అని పరిశీలిస్తే షాప్ ముందు స్తంభంపై ఉన్న పాము వారికి తారసపడింది.. పాము పగ పట్టడం వల్ల ఇలా జరిగింది అని కొందరు స్థానికులు భావిస్తున్నారు..  షాప్ దగ్దం అయిపోవడంతో తాము రోడ్డున పడ్డామని ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది.

ఆ అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాధితులను పరామర్శించారు. నాగు పాము రూపంలో వచ్చి బూడిద మిగల్చడం జనంలో చర్చగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *