శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే నానుడి వింటుంటాం..! కానీ అక్కడ కక్కుర్తిగాళ్ళు నిజం చేసి చూపారు.. అంతిమ సంస్కారాలు నిర్వహించే స్వర్గ రథం వీల్స్ దొంగతనం చేసి ఊరంతా షాకయ్యేలా చేశారు ఆ కక్కుర్తి గాళ్ళు. చనిపోయిన వ్యక్తి అంతిమయాత్ర కోసం ఆ వాహనాన్ని సిద్ధంచేస్తున్న సమయంలో వీల్స్ మాయమవ్వడం చూసి ఊరంతా షాకయ్యారు. దహన సంస్కారాలకు ఉపయోగించే అంతిమయాత్ర వాహనం రథ చక్రాలను దొంగిలించిన విచిత్ర ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం ప్రక్కనే అంతిమయాత్ర స్వర్గ రథం వాహనాన్ని పార్కింగ్ చేశారు. వాహనం వీల్స్ కొత్తగా కనిపించడంతో గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు శనివారం(ఆగస్టు 2) అర్ధరాత్రి అంతిమయాత్ర వాహనానికి ఉన్న నాలుగు చక్రాలను ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే గమనించిన పారిశుద్ధ కార్మికులు అందుబాటులో ఉన్న మండల ఎంపీడీవో సురేష్ కుమార్‌కు, స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. స్వర్గ రథం వాహనాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించే వాహనం వీల్స్ దొంగిలించిన ఆ కక్కుర్తిగాళ్ళు ఊరంతా చర్చగా మారారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..