Telangana: మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?

Telangana: మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?


Telangana: మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?

గత వారం మేడారం జాతర సందర్భంగా సమ్మక్క గద్దెపైకి వచ్చిన రోజు జంపన్నవాగు సమీపంలో ఓ మైనర్ బాలికపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. అయితే జాతర అనంతరం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ ఆరోపణలను సుమోటోగా స్వీకరించి ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటుచేసిన జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తుకు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కమిషన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్ నాథ్ కేకన్ తో భేటీ అయ్యారు. అనంతరం మేడారం జాతర పరిసరాలలో గ్యాంగ్ రేప్ జరిగిందని భావిస్తున్న ప్రాంతం పరిశీంచారు. ఈ సందర్భంగా జాతరలో ఎలాంటి గ్యాంగ్ రేప్ ఘటన జరగలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక దానిని జాతీయ మహిళా కమిషన్‌కు అందించనున్న ఎంక్వయిరీ బృందం తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *