Telangana: భార్యపై అనుమానం.. కూతురి ముందే అతికిరాతకంగా భార్యను హత్య చేసిన భర్త!

Telangana: భార్యపై అనుమానం.. కూతురి ముందే అతికిరాతకంగా భార్యను హత్య చేసిన భర్త!


ఇటీవల కాలంలో మానవ సంబంధాలు దయనీయంగా మారిపోయాయి. డబ్బుల కోసం కన్నవాళ్లను కడతేరుస్తున్న కొడుకులు కొందరైతే, అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న భర్తను హత్యలు చేస్తున్న భార్యలు మరికొందరు. ఇక మరికొందరైతే అనుమానం లేదా వరకట్నపు వేధింపులతో భార్యలను హత్య చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లాలోనూ ఇలాంటి ఓ ఘటనే వెలుగు చూసింది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటినుండి పారిపోయాడు.

వివరాల్లోకి వెలితే.. మేడ్చల్‌లో నివాసం ఉంటున్న రాంబాబు అనే వ్యక్తి తన భార్య కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. రాంబాబు మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి వివాహం జరిగి కూడా కేవలం ఏడాదిన్నర మాత్రమే అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భర్త తరచూ భార్యకు మరోవ్యక్తితో సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేసేవాడు. ఇదే విషయంపై పలు మార్లు వీరి మధ్య గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.

అయితే, తాగాజా ఇదే విషయంపై మరోసారి భార్య భర్తల మధ్య గొడవ మొదలైంది. అది కాస్తా తీవ్రంగా మారి భర్త రాంబాబు భార్యను గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐదేళ్ల కూతురు.. వులుకు పలుకు లేకుండా పడిఉన్న తల్లిని లేపేందుకు ప్రయత్నించింది. ఎంతసేపు పిలిచినా తల్లి లేవకపోయే సరికి.. ఈ చిన్నారి ఏడుస్తూ అక్కడే కూర్చుండి పోయింది.

చిన్నారి ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు.. పక్కనే తల్లి చనిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానంతో భర్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *