తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక సూచనలు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని బోర్డు కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే ప్రతి హాల్‌లో వాల్ క్లాక్ (గోడ గడియారం) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి డ్యుయల్ డెస్క్ తప్పనిసరిగా అందించాలని బోర్డు తేల్చి చెప్పింది. పరీక్షల సమయంలో ఏ విద్యార్థినీ నేలపై కూర్చోబెట్టరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే అధికారిక సూచనలు కూడా ఇచ్చినట్లు తెలిపింది. అలానే.. పరీక్షా కేంద్రాల్లోని ప్రతి హాల్‌లో ఫ్యాన్లు, సరైన వెంటిలేషన్, టాయిలెట్ సదుపాయం, సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి ఆదేశించారు. పరీక్షల్లో పారదర్శకత, భద్రత కోసం అన్ని పరీక్షా కేంద్రాల్లో CCTV నిఘా ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు తెలిపింది. అలాగే.. పరీక్షల విధుల్లో నిపుణులైన సిబ్బందినే నియమించాలని సూచించింది.
ఇక పరీక్షల వేళ ఇంటర్ స్టూడెంట్స్ కొన్ని టిప్స్ పాటిస్తే ఒత్తిడిని దూరం చేయొచ్చు. రోజుకు చిన్న టార్గెట్ పెట్టుకుని చదవండి. 45 నిమిషాలు చదువిన తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీస్కోండి. మొబైల్ సైలెంట్/ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టండి. రాత్రి కనీసం 6 గంటలు నిద్ర తప్పనిసరి ఉండేలా ప్లాన్ చేసుకోండి. రోజూ 15–20 నిమిషాలు వాక్ చేస్తే మైండ్ ప్రెష్‌గా ఉంటుంది. గత ప్రశ్నపత్రాలు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. టెన్షన్ అయితే 10 స్లో శ్వాసలు తీసుకోండి. టీ, కాఫీ ఎక్కువ తాగొద్దుచివరి నిమిషంలో కొత్త టాపిక్స్ చదివే ప్రయత్నం చేయొద్దు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..