నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మకాం నరేష్ అనే వ్యక్తి టాటూ ఆర్టిస్టుగా పనిచేస్తూ హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. బేగంపేట సెవెన్ హిల్స్ టాటూ సెంటర్లో టాటూ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. ఇటీవలే అచ్చంపేట మండలం రంగాపూర్ ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వర క్షేత్రానికి స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అక్కడ ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకొని… ఆలయ పరిసరాలను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిశీలించాడు. అయితే స్వామి వారి ఆలయానికి రక్షణగా కనిపించే కొండను క్షుణ్ణంగా చూశాడు. తనలో ఉన్న సృజనాత్మక కోణంతో ఫోటో తీశాడు. ఉమామహేశ్వర క్షేత్రంలో ఉన్న జలపాతం వద్ద నుండి తీసిన ఫోటో అచ్చం ఆ పరమశివుడి ఆకారంలో కనిపించింది. ఇంకేముంది స్వతహాగా టాటూ ఆర్టిస్ట్ కావడంతో తన స్మార్ట్ ట్యాబ్ సహాయంతో ఆ పర్వతాన్ని అచ్చం పరమశివుడి అవతారంలా స్కెచ్ వేసాడు. ఆ కొండ కైలాసగిరీశుడు రూపాన్ని పోలి ఉంది. ఇంకేముంది నరేష్ తీసి… స్కెచ్ వేసిన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుమల ఏడు కొండల్లో కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలు వారు ఎలా దర్శమిస్తున్నాడు అలా ఆ పరమేశ్వరుడు శ్రీశైలం ఉత్తర ద్వారంగా పరిగణిస్తున్న ఉమామహేశ్వర క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు.
ఇక టాటూ ఆర్టిస్టు నరేష్ తీసిన చిత్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దశాబ్ధాలుగా స్వామి వారి దర్శనానికి వస్తున్నప్పటికీ ఏనాడు ఈ దివ్య రూపాన్ని గమనించలేదని చెబుతున్నారు. తిరుమల ఏడుకొండల మాదిరిగా నల్లమల ఉమామహేశ్వర క్షేత్రంలో సహజ శిల రూపంలో శివుడి రూపం దర్శనమివ్వడం స్వామివారి కృపగా పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.