
ఒడిశా నుంచి ఖమ్మం మీదుగా ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అప్రమత్తమైంది. ఇటీవల గంజాయి టీమ్ మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తుండడంతో ఖమ్మం టీమ్ కొద్దిరోజులుగా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే.. ఒడిశా నుంచి రాజమండ్రి, ఖమ్మం, సూర్యాపేట మీదుగా ఉత్తరప్రదేశ్‌కు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఖమ్మం, ఈగల్, సైబరాబాద్ నార్కోటిక్ సిబ్బంది రంగంలోకి దిగింది. శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవేపై వాహన తనిఖీలు నిర్వహించగా.. బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తున్న గ్యాంగ్ అడ్డంగా బుక్కయింది. వందా, రెండు వందలు కాదు.. ఏకంగా.. 847 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు 4కోట్లుగా ఉంటుందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు.
26 బ్యాగుల్లో 411 ప్యాకెట్లుగా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈగల్ టీమ్ అధికారులు. ఈ గంజాయి తరలింపులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన షఫీని కింగ్‌పిన్‌గా గుర్తించారు. రమేష్ సుక్రీ, జగదీష్ కల్దీప్ కొనుగోలు చేసి.. ఖిల్లా ధన, రాజేందర్ భజింగ్ ద్వారా గంజాయి తరలిస్తున్నట్లు తేల్చారు. ఇక.. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ వాహనంలో కత్తులతోపాటు వివిధ రకాల ఆయుధాలు ఉండడంతో పోలీసులు షాకయ్యారు. ఈ స్పెషల్ ఆపరేషన్‌లో కీ రోల్ పోషించిన ఖమ్మం టీమ్‌ను నార్కోటిక్ ఎస్పీ రూపేష్ అభినందించారు. అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులపై గతంలో కేసులు నమోదు కావడంతో పాటు.. జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు. కీలక నిందితులను గుర్తించిన నేపథ్యంలో ఒడిశా, యూపీ గంజాయి గ్యాంగ్ డొంక కదిలించే పనిలో పడ్డారు నార్కోటిక్ బ్యూరో అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి