తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 250 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో మంగళవారం ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఇటీవలే రెండో విడతగా రూ. 387 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఈ నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గాను, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలకు గాను, రహదారులను పునరుద్దరించేందుకు, కొత్త రోడ్లను నిర్మించేందుకు ఉపయోగించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ 15వ ఆర్థిక సంఘం కింద ఇంకా రాష్ట్రానికి సుమారు రూ. 3000 కోట్లు రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేయనున్నట్టు పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.