Headlines

Telangana: కొడుకు కార్మికుడిగా ఉన్న మున్సిపాలిటీకే ఛైర్మన్‌గా ఎన్నికైన తండ్రి.. ఆ జిల్లాలో అరుదైన ఘటన!

Telangana: కొడుకు కార్మికుడిగా ఉన్న మున్సిపాలిటీకే ఛైర్మన్‌గా ఎన్నికైన తండ్రి.. ఆ జిల్లాలో అరుదైన ఘటన!


కొడుకు కార్మికుడిగా పనిచేస్తున్న మున్సిపాలిటీకే తండ్రి ఛైర్మన్‌గా ఎన్నికైన ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో వెలుగు చూసింది.
తాజాగా జరిగిన కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏడవ వార్డు హనుమ తండా నుంచి దారావత్ మోహన్ కాంగ్రెస్ పార్టీ తరుపున కౌన్సిలర్ గా పోటీ చేసయగా.. మెజార్టీతో గెలుపొందాడు. కౌన్సిలర్ల మద్దతుతో ఏకంగా ఆయన కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మోహన్ ప్రజాసేవలో నిమగ్నం అయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా తండ్రి ఛైర్మన్‌గా ఎన్నికైన అదే మున్సిపాలిటీలో అతని పెద్ద కుమారుడైన దారావత్ రఘు మున్సిపాలిటీ పారిశుద్ధ్య సేకరణలో ట్రాక్టర్ డ్రైవర్‌గా గత మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవకు అంకితమయ్యాడు. ఇలా కల్లూరు పురపాలక సంఘం పరిధిలో ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరకడం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తండ్రి, కొడుకులకు చెబుతున్నారు. ఇక ప్రజాసేవలో అంకితమైన తండ్రి కొడుకులను అటు స్థానికులు సైతం అభినందిస్తున్నారు

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *