Telangana: కుక్కలు బాబోయ్‌.. కాపాడండి మహప్రభో.. వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్న జనాలు!

Telangana: కుక్కలు బాబోయ్‌.. కాపాడండి మహప్రభో.. వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్న జనాలు!


Telangana: కుక్కలు బాబోయ్‌.. కాపాడండి మహప్రభో.. వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్న జనాలు!

మెదక్, ఫిబ్రవరి 20: ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి పై దాడులు చేస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తూ.. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘటన వెలుగులోకి వస్తుంది. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న శివ అనే ఐదు సంవత్సరాల బాలుడిపై ఐదు వీధి కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో బాలునికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మరవకముందే.. మెదక్ పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ అనే మహిళ ఇంటి ఎదుట పని చేస్తుండగా అటుగా వచ్చిన వీధి కుక్క ఆమెపై దాడి చేశాయి.

ఈ దాడిలో లక్ష్మమ్మ కాలికి తీవ్ర గాయం అయ్యింది. ఆమె అరుపులు విన్న స్థానికులు కుక్కను తరిమివేసి, మహిళను వెంటనే ఆస్ప త్రికి తరలించారు. ఇక సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామంలో గౌతమి అనే బాలిక పాఠశాల నుండి వచ్చి ఇంటి ముందు ఆడుకుంటుండగా.. అటుగా వెళ్తున్న పిచ్చి కుక్క చిన్నారి గౌతమిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటనలో గౌతమి తల, ముఖానికి గాయాలయ్యాయి. చిన్నారి గౌతమిని ప్రథమ చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇలా తరచూ జరుగుతున్న ఈ కుక్కల దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *