బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.. ఎప్పుడు పుట్టారన్న దానికి స్పష్టమైన ఆధారాలు లేవు కానీ, 8 ఏళ్లు వచ్చేసరికి వీర బ్రహ్మేంద్రస్వామికి అపారమైన జ్ఞానం సంపాదించుకున్నారు. ఆధ్యాత్మికత చింతన కలిగిన ఆయన.. జ్ఞానసముపార్జన కోసం దేశ సంచారం చేశారు. ఇక ఆ తర్వాత భవిష్యత్‌లో ఏం జరగబోతుందో తాళపత్ర గ్రంథాల్లో రచించారు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజమవుతున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత వెలుగులోకి వచ్చింది.
ఇదో వింత.. స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.. దీంతో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా..అనే చర్చ జరుగుతోంది. ప్రపంచ వినాశనం నిజమేనా.. కలిపురుషుడు జన్మించడం సాధ్యమా.. నాటినుండి ఒక్కొక్కటి నిజమవుతూ వస్తుంది. కొన్ని సంఘటనలు వింత గా, ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. చింతమొక్క తనంతట తాను తిరుగుతూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.. అసలు ఏమి జరుగుతుందా అని స్థానికులు చింత మొక్క వద్దకు వచ్చి వింతగా చూస్తున్నారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ సీతారాంపురం SC కాలనిలో జొన్నలగడ్డ వెంకటమ్మ అనే గృహిణి ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ.. ఓ చింతమొక్క కదలడం గమనించింది. మొక్క ప్రక్కన ఏమైనా క్రిమి కీటకాలు విష సర్పాలు ఉన్నాయా అని భర్త మస్తాన్ ను పిలిచింది. భార్యాభర్తలు ఇరువురు ఆ చుట్టూ ప్రక్కల చూసి శుభ్రం చేసి చూశారు. చాలా సేపు ఏమి జరిగిందా అని గమనించారు.. కీటకాలు కనిపించకపోగా చింత మొక్క తనంతట తాను తిరుగుతూ.. విస్తుపోయే విధంగా కనిపించింది. ఈ విషయం ఈ నోటా.. ఆ నోటా ఊరంతా పాకింది. దీంతో గ్రామస్తులందరూ తిరుగుతున్న చింత మొక్కను చూడటానికి ఎగబడ్డారు. భారీగా తరలివచ్చిన ఇరుగుపొరుగు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎలాంటి వింత అని.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని స్థానికులు అంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..