Tech Tips: మీరు కంప్యూటర్‌ ఎక్కువగా వాడతారా? 10 ముఖ్యమైన కీబోర్డ్‌ షార్ట్‌ కట్స్‌!

Tech Tips: మీరు కంప్యూటర్‌ ఎక్కువగా వాడతారా? 10 ముఖ్యమైన కీబోర్డ్‌ షార్ట్‌ కట్స్‌!


ఇప్పుడు ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉంటుంది. ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటిగా మారింది. చాలా మంది కంప్యూటర్‌లో పని చేస్తారు. కొన్నిసార్లు కంప్యూటర్‌లో సులభంగా చేయగలిగే పనిని కూడా మౌస్‌ని ఉపయోగించి సమయాన్ని వృధా చేస్తాము. మన పనిని సులభతరం చేయడానికి విండోస్‌లో కొన్ని ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్ కీలు ఉన్నాయి. అవి మీ పనిని సులభతరం చేస్తాయి. అంతేకాదు సమయాన్ని ఆదా చేస్తాయి. మరి కంప్యూటర్‌ పనిని సులభతరం చేసే 10 ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్ కీల గురించి తెలుసుకుందాం.

1. స్క్రీన్‌షాట్ తీయడానికి – విండోస్ కీ + షిఫ్ట్ + ఎస్:

విండోస్ కీ + షిఫ్ట్ + S నొక్కితే స్నిప్పింగ్ టూల్ తెరుచుకుంటుంది. ఇది మీ డిస్‌ప్లేలో ఒక భాగాన్ని ఎంచుకుని స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు కోరుకుంటే తర్వాత కూడా దాన్ని సేవ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

2. వెంటనే డెస్క్‌టాప్‌కి వెళ్లండి – విండోస్ కీ + D:

మీరు త్వరగా డెస్క్‌టాప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? వెంటనే డెస్క్‌టాప్‌కి వెళ్లడానికి విండోస్ కీ + D నొక్కండి. వెంటనే విండో ఓపెన్‌ అవుతుంది.

3. టాస్క్ మేనేజర్‌ ఓపెన్‌ – Ctrl + Shift + Esc:

మనం పని చేస్తున్నప్పుడు కంప్యూటర్ హ్యాంగ్ అయితే, Ctrl + Shift + Esc నొక్కితే టాస్క్ మేనేజర్ తెరుచుకుంటుంది. దీనివల్ల ఆ విండోను మాత్రమే మూసివేయవచ్చు.

4. విండోస్ కోపైలట్‌కు వెళ్లండి – విండోస్ కీ + సి:

విండోస్‌లో కోపిలట్ అనే కొత్త AI ఫీచర్ ప్రవేశపెట్టింది. దీన్ని త్వరగా ఓపెన్ కావడానికి విండోస్ కీ + సి నొక్కండి.

5. మరొక బ్రౌజర్ ట్యాబ్‌కు మారండి – Ctrl + Tab లేదా Ctrl + Shift + Tab:

బ్రౌజర్‌లో బహుళ ట్యాబ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఒక ట్యాబ్ నుండి మరొక ట్యాబ్‌కు వెళ్లడానికి Ctrl + Tab లేదా Ctrl + Shift + Tab నొక్కండి .

6. రీసైకిల్ బిన్‌కి వెళ్ళకుండా నేరుగా తొలగించడానికి – Shift + Delete:

మీరు Shift + Delete అనే షార్ట్‌కట్ కీని ఉపయోగించి నేరుగా ఫైల్‌లను తొలగించవచ్చు. ఇది వినియోగదారుడు అవాంఛిత ఫైల్‌లను నేరుగా శాశ్వతంగా తొలగించడానికి అనుమతిస్తుంది. ఈ షార్ట్‌కట్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి.

7. చేసే పనిని క్యాన్సిల్‌ చేయడానికి – Ctrl + Z:

మీరు పొరపాటు చేస్తే మీ మునుపటి పనిని అన్డు చేయడానికి లేదా పునరుద్ధరించడానికి మీరు Ctrl + Z కీని ఉపయోగించవచ్చు.

8. కంప్యూటర్‌ను వెంటనే లాక్ చేయడానికి – విండోస్ కీ + L:

మీరు ఇంట్లో ఉన్నా లేదా ఆఫీసులో ఉన్నా, మీ కంప్యూటర్‌ను తాత్కాలికంగా, వెంటనే లాక్ చేయడానికి Windows Key + L ని ఉపయోగించవచ్చు.

9. ఎమోజి మెనూ తెరవండి – విండోస్ కీ + . (చుక్క):

మీరు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన ప్రదేశాలలో ఎమోజీని జోడించాలనుకుంటే, విండోస్ కీ + .(డాట్) అనే షార్ట్‌కట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

10. అన్ని విండోలను ఒకేసారి చూడటానికి – విండోస్ కీ + ట్యాబ్:

మీ కంప్యూటర్‌లోని అన్ని విండోలను ఒకేసారి చూడటానికి మీరు Windows Key + Tab నొక్కవచ్చు. ఇది Windows Task Viewలో మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న అన్ని విండోలను మీకు చూపుతుంది.

మరిన్నిటెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *