Team India : ఎవరీ మిస్టరీ లేడీ? టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించిన మహిళపై ఆర్ తీస్తున్న ఫ్యాన్స్

Team India : ఎవరీ మిస్టరీ లేడీ? టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించిన మహిళపై ఆర్ తీస్తున్న ఫ్యాన్స్


Team India :క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి.ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ సమయంలో కూడా అలాంటి ఓ ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక మిస్టరీ గర్ల్ కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియలో హాట్ టాపిక్ అయింది. ఈ మహిళ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆమె టీమ్ సపోర్ట్ స్టాఫ్ సభ్యులలో ఒకరై ఉండవచ్చని అంతా భావిస్తున్నారు. కానీ ఆమె ఎవరో స్పష్టంగా తెలియకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తింది.

ఆ మహిళ డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించి శుభమాన్ గిల్ డబుల్ సెంచరీ సాధించినప్పుడు చప్పట్లు కొడుతూ కనిపించింది. అలాగే ప్లేయర్లు ఫీల్డ్‌లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వెనుక నిలబడి ఉన్న ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, ఆమె టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌లో లేదా అనలిస్ట్ టీమ్‌లో సభ్యురాలై ఉండొచ్చని ఊహిస్తున్నారు. గతంలో కూడా కొన్ని జట్లలో మహిళలు సపోర్ట్ స్టాఫ్‌గా పనిచేశారు.

ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఉన్నారు. ఫీల్డింగ్ కోచ్‌గా టీ.దిలీప్ ఉండగా, బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఈ మిస్టరీ మహిళ ఏ విభాగంలో పనిచేస్తున్నారు అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

గురువారం మ్యాచులో టీం ఇండియా కెప్టెన్ శుభమాన్ గిల్ 269 పరుగులతో టీంను ముందుండి నడిపించగా, జట్టు ఏకంగా 151 ఓవర్ల పాటు ఇంగ్లాండ్‌ను ఫీల్డ్‌లో ఉంచి 587 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. యశస్వి జైస్వాల్(87), రవీంద్ర జడేజా(89) పరుగులతో టీం ఇండియా భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడంతో.. అతని స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ బౌలింగ్ బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా రాణించాడు. అతను తన రెండో ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. బెన్ డకెట్, ఒలీ పోప్ లను వరుస బంతుల్లో డకౌట్ చేశాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *