భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో తన స్థానం మరింత బలపర్చేందుకు టాటా మోటార్స్ అప్డేట్ చేసిన Punch.evని విడుదల చేసింది. ఈ అతి చిన్న ఎలక్ట్రిక్ SUVకు ఇదే తొలి మేజర్ అప్‌డేట్. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.69 లక్షలుగా నిర్ణయించగా, టాప్ వేరియంట్ రూ.12.59 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది.
వేరియంట్లు, ధరలు
Punch.ev మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Smart, Adventure, Empowered. ఎంట్రీ-లెవల్ EV కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని ధరలను ICE కార్లకు సమీపంగా ఉంచింది. ఇంకా ఖర్చు తగ్గించేందుకు కంపెనీ Battery-as-a-Service (BaaS) ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ మోడల్‌లో వాహనం ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి మొదలవుతుంది, అయితే బ్యాటరీకి కిలోమీటరుకు రూ.2.6 చొప్పున సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలి.
డిజైన్‌లో మార్పులు
- ఫేస్‌లిఫ్ట్ Punch.evలో చిన్న చిన్న స్టైలింగ్ అప్‌డేట్లు ఉన్నాయి
- కొత్త క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్‌తో క్లీనర్ ఫ్రంట్ బంపర్
- హెడ్‌ల్యాంప్‌ల మధ్య బ్లాక్ ట్రిమ్ తొలగింపు
- సిగ్నేచర్ Y-షేప్ LED DRLs అలాగే ఉంచారు.
- కొత్త 16-ఇంచ్ ఏరో ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్
- వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్
- మూడు కొత్త ఎక్స్‌టీరియర్ కలర్స్ + బ్లాక్ రూఫ్
బ్యాటరీ ఎంపికలు విస్తరణ, వాస్తవ ప్రపంచ రేంజ్ మెరుగుదల, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో Punch.ev ఇప్పుడు పట్టణ వినియోగదారులతో పాటు ఇంటర్‌సిటీ ప్రయాణాలకు కూడా అనుకూలంగా మారింది. ముఖ్యంగా BaaS మోడల్ ద్వారా మొదటిసారి EV కొనాలనుకునే వారికి ప్రవేశ అడ్డంకులు తగ్గే అవకాశముంది. తక్కువ ఖర్చుతో EV వెహికల్ కొనాలని అనుకుంటున్నవారికి ఈ Punch.ev మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి