T20 World Cup 2026: సూపర్-8లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన భారత్.. టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఔట్..?

T20 World Cup 2026: సూపర్-8లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన భారత్.. టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఔట్..?


T20 World Cup Points Table Updated: టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్‌ను ఏకపక్షంగా ఓడించిన సూర్యసేన.. ఈ విజయంతో సూపర్ 8లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన తొలి జట్టుగా నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఈ స్కోరు కొలంబో పిచ్‌పై పాకిస్థాన్‌ జట్టుకు చాలా ఎక్కువ అని నిరూపితమైంది. పాకిస్తాన్ బ్యాటర్స్ భారత బౌలింగ్‌కు పూర్తిగా లొంగిపోయారు. దీంతో పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించవచ్చు. గ్రూప్ ఏలో పాయింట్ల పట్టిక పరిస్థితిన ఓసారి చూద్దాం..

గ్రూప్ ఏలో భారత్ ఆధిపత్యం..

గ్రూప్ ఏలో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయంతో భారత జట్టు అద్భుతమైన నెట్ రన్ రేట్‌తో సూపర్ 8కి చేరుకుంది. ఈ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ టీం తన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటోంది. నమీబియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతే, అది ఎలిమినేట్ అవుతుంది. యునైటెడ్ స్టేట్స్ రెండు మ్యాచ్‌లను గెలిచింది. మెరుగైన నెట్ రన్ రేట్‌ను కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో యునైటెడ్ స్టేట్స్ రెండవ స్థానానికి చేరుకోగా, పాకిస్తాన్ మూడవ స్థానానికి పడిపోయింది.

పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్..

కొలంబో మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ తరపున ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అతను తప్ప మరెవరూ బాగా రాణించలేదు. ఏడుగురు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. భారత జట్టు తరపున ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి అదరగొట్టాడు. బౌలింగ్‌లో పాండ్యా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ తలా 1 వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *