Headlines

T20 World Cup 2026 : విశ్వవిజేత రేసులో నిప్పులు చెరుగుతున్న జట్లు..ఇండియాకు ఆ మూడు దేశాల నుంచే ముప్పు

T20 World Cup 2026 : విశ్వవిజేత రేసులో నిప్పులు చెరుగుతున్న జట్లు..ఇండియాకు ఆ మూడు దేశాల నుంచే ముప్పు


T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 అసలైన మజా మొదలైంది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ఈసారి ఆట కంటే ఎక్కువగా మైదానం బయట జరుగుతున్న రాజకీయ పరిణామాలే హాట్ టాపిక్‌గా మారాయి. అయితే మైదానంలో మాత్రం టీమిండియా తిరుగులేని ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టును ఢీకొట్టడం ఏ జట్టుకైనా సవాలే. కానీ, టైటిల్ రేసులో భారత్‌కు చెక్ పెట్టేందుకు మరో మూడు, నాలుగు జట్లు కూడా అంతే బలంగా కనిపిస్తున్నాయి.

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. ముఖ్యంగా భారత్, శ్రీలంక పిచ్‌లపై మన స్పిన్నర్లు మాయ చేసే అవకాశం ఉంది. పాకిస్థాన్ వంటి జట్లు చిన్న జట్ల మీద గెలవడానికే ఆపసోపాలు పడుతున్న తరుణంలో, టీమిండియా మాత్రం ప్రయోగాలు చేస్తూనే విజయాలు సాధిస్తోంది. ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్‌పై పాక్ అతి కష్టమ్మీద గెలిచిందంటేనే వారి ఫామ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారత్ తర్వాత అత్యుత్తమ బౌలింగ్ దళం ఎవరి దగ్గరైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా దగ్గరే. కగిసో రబాడ, అన్రిచ్ నోర్కియా, మార్కో యాన్సెన్ వంటి బుల్లెట్ వేగంతో బంతులు విసిరే బౌలర్లకు తోడు కేశవ్ మహరాజ్ వంటి స్పిన్నర్ ఉన్నాడు. ఇక క్వింటన్ డికాక్, క్లాసెన్, మిల్లర్ వంటి పవర్‌ఫుల్ బ్యాటర్లు ఏ క్షణమైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు గత నెల రోజులుగా భారత్‌లోనే పర్యటిస్తుండటం వారికి కలిసి వచ్చే అంశం. ఫిన్ అలెన్, డారిల్ మిచెల్ వంటి వారు మన పిచ్‌లపై పట్టు సాధించారు. సాంట్నర్ మరియు లోకీ ఫెర్గూసన్ కివీస్ జట్టుకు ప్రధాన బలంగా మారారు.

ఆస్ట్రేలియా జట్టులో ఈసారి పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రధాన బౌలర్లు గాయాల కారణంగా లేకపోయినా, వారిని తక్కువ అంచనా వేయలేం. నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్ వంటి యువ బౌలర్లు టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి హిట్టర్లు చెలరేగితే ఆపడం కష్టం. ఇక శ్రీలంక జట్టుకు హోమ్ అడ్వాంటేజ్ పెద్ద ప్లస్ పాయింట్. వానిందు హసరంగా, మహీష్ తీక్షణ వంటి స్పిన్నర్లు మన పిచ్‌లపై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలరు. పతిరానా వేగవంతమైన యార్కర్లు శ్రీలంకకు తురుపు ముక్కలు కానున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *