T20 World Cup 2026 : ఆస్ట్రేలియా కొంప ముంచుతున్న వరుణుడు.. 60 బంతులు పడకపోతే కంగారూలు ఇంటికే

T20 World Cup 2026 : ఆస్ట్రేలియా కొంప ముంచుతున్న వరుణుడు.. 60 బంతులు పడకపోతే కంగారూలు ఇంటికే


T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-బిలో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగాల్సిన జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ ఇప్పుడు ఉత్కంఠకు తెరలేపింది. ఈ మ్యాచ్ కేవలం ఈ రెండు జట్లకే కాదు, పాయింట్ల పట్టికలో వెనుకబడిన ఆస్ట్రేలియా భవితవ్యానికి కూడా అత్యంత కీలకంగా మారింది. వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినట్లే పల్లెకెలెలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో టాస్ కూడా పడకుండానే ఆట నిలిచిపోయింది. ఒకవేళ ఈ మ్యాచ్ గనుక వర్షం వల్ల పూర్తిగా రద్దయితే, దాని ప్రభావం ఆస్ట్రేలియా పైన తీవ్రంగా పడనుంది.

ఎన్ని గంటలకు మ్యాచ్ మొదలవుతుంది?

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జాప్యమవుతోంది. తాజా నివేదికల ప్రకారం..సాయంత్రం 4:10 గంటల నుంచి ఓవర్ల కోత ప్రక్రియ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా సాయంత్రం 6:10 నుంచి 6:15 గంటల లోపు ఆట మొదలుకావాలి. ఒకవేళ అప్పటికి కూడా వర్షం తగ్గకపోయినా లేదా అవుట్‌ఫీల్డ్ ఆటకు అనుకూలించకపోయినా అంపైర్లు మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేస్తారు.

60 బంతులు.. ఆస్ట్రేలియా తలరాత

ప్రస్తుతం గ్రూప్-బిలో శ్రీలంక 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి ఇప్పటికే సూపర్-8కు క్వాలిఫై అయ్యింది. రెండో స్థానం కోసం జింబాబ్వే (4 పాయింట్లు), ఆస్ట్రేలియా (2 పాయింట్లు) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆస్ట్రేలియా సూపర్-8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయి రెండు జట్లు చెరో పాయింట్ పంచుకుంటే, జింబాబ్వే 5 పాయింట్లతో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అప్పుడు ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై గెలిచినా గరిష్టంగా 4 పాయింట్లకే చేరుకుంటుంది. అంటే కనీసం 60 బంతుల ఆట (5 ఓవర్లు) సాధ్యపడకపోతే మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.

జింబాబ్వేకు గోల్డెన్ ఛాన్స్

ఈ టోర్నీలో జింబాబ్వే అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటికే మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచిన సికందర్ రజా సేన, ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా లేదా ఐర్లాండ్‌పై విజయం సాధించినా జింబాబ్వే అధికారికంగా సూపర్-8లోకి అడుగుపెడుతుంది. ఇది జరిగితే 2009 తర్వాత ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్‌లోనే వెనుదిరగడం ఇదే మొదటిసారి అవుతుంది. ఐర్లాండ్ ఇప్పటికే రేసులో వెనుకబడి ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలవాలని భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *