T20 Series : ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్ గెలవడానికి ఒక అడుగు దూరంలో భారత్..19ఏళ్ల కల నెరవేరేనా ?

T20 Series : ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్ గెలవడానికి ఒక అడుగు దూరంలో భారత్..19ఏళ్ల కల నెరవేరేనా ?


T20 Series : భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య నేడు (జూలై 4, శుక్రవారం) టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించడానికి రెడీగా ఉంది. ఒకవేళ భారత్ ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో గెలిస్తే 19 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్‌పై భారత జట్టు సాధించిన సిరీస్ విజయం ఇదే అవుతుంది.భారత మహిళల జట్టుకు ఇంగ్లాండ్‌లో ఈ సిరీస్ గెలవడం చాలా ప్రత్యేకమైంది. భారత్ 2006 నుండి ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవలేదు. 2006లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌కు కేవలం ఒక టీ20 మ్యాచ్ ఆడటానికి వెళ్లింది. ఆ మ్యాచ్‌ను భారత్ గెలిచి, సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 2006 నుండి ఇప్పటివరకు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆరు టీ20 సిరీస్‌లు జరిగాయి. వీటిలో భారత్ ప్రదర్శన నిరాశపరిచింది. ఈ ఆరు సిరీస్‌లలో మూడు ఇంగ్లాండ్‌లో, మూడు భారత్‌లో జరిగాయి. కానీ ఈ 19 సంవత్సరాల్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌పై ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవలేకపోయింది.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. మొదటి రెండు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు భారత్ మూడో మ్యాచ్‌ను కూడా గెలిస్తే, 19 సంవత్సరాల తర్వాత భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో ఇది మన విజయం అవుతుంది. ఒకవేళ భారత్ ఈరోజు మ్యాచ్‌ను గెలిచి, మిగిలిన రెండు మ్యాచ్‌లలో కూడా విజయం సాధిస్తే, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుంది. ఈ సిరీస్ విజయం భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

టీమిండియా ప్లేయింగ్ XI:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), స్మృతి మంధా, జెమిమా రోడ్రిగ్స్, డిబి శర్మ,రాధా యాదవ్, షెఫాలీ వర్మ, స్నేహ రాణా, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి,

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI:
ఏఈ జోన్స్(వికెట్ కీపర్), డిఎన్ వ్యాట్, సర్ డంక్లీ, టిటి బ్యూమాంట్, ఎన్‌ఆర్ సైవర్(కెప్టెన్), ఎలిస్ క్యాప్సీ, ఈఎల్ అర్లట్, ఎల్‌కే బెల్, ఎల్‌సిఎన్ స్మిత్, ఎస్ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *