కలలు మన జీవితానికి అద్దం వంటివి. కలల ద్వారా మనకు మంచి, చెడు సంకేతాలు రెండూ లభిస్తాయి. కలలు రావడం వెనుక ఏదో కారణం ఉంటుంది. దానిని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయని విశ్వాసం. అయితే కొన్ని కలలు మనకు రానున్న చెడు సమయాల గురించి సూచనను ఇస్తాయి. మరికొన్ని కలలు మన రాబోయే మంచి సమయాలను సూచిస్తాయి.
కలలో దేవుడిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతున్నప్పటికీ.. ఈ కలల గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏ దేవుడు, ఏ దేవత మీకు కలలో కనిపించింది.. కలలో ఏ ఆలోచన వచ్చిందో, దానిని లెక్కించిన తర్వాత.. ఆ కల మంచిదా చెడ్డదా అని అంచనా వేయాల్సి ఉంటుందని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ రోజు ఎవరి కలలోనైనా దుర్గాదేవి కనిపిస్తే.. ఆ కలకు అర్ధం.. అమ్మవారు ఇచ్చే సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం..
స్వప్న శాస్త్రం ప్రకారం దేవతకు సంబంధించిన కలలకు అర్థం
- స్వప్న శాస్త్రం ప్రకారం.. ఎవరైనా దుర్గాదేవిని పూజిస్తున్నట్లు కనిపిస్తే.. అతని జీవితంలో త్వరలో ఏదో ఒక మంచి శుభ వార్త విననున్నారని ఈ కల ద్వారా సంకేతం అమ్మవారు పంపించినట్లట. అంటే అతని జీవితంలో ఏదో ఒక శుభ సంఘటన జరగబోతోంది.
- నవరాత్రి సమయంలో మీరు దుర్గాదేవిని ప్రత్యక్షంగా చూసినట్లు కల వచ్చినా.. లేదా మీ కలలో దుర్గాదేవి విగ్రహం, చిత్ర పటం లేదా ఏదైనా రూపంలో అమ్మవారు కనిపించినా మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయని .. మీ జీవితంలో ఆనందానికి తాళంచెవిని పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి.
- మీరు దుర్గాదేవిని లేదా ఆమె ఏ రూపంలోనైనా సింహంపై స్వారీ చేస్తున్నట్లు చూస్తే.. మీ ప్రత్యర్థులు, శత్రువులు నాశనం అవుతారని మీరు భావించాలి.
- మీరు కలలో దేవతను పూజిస్తున్నట్లు కనిపిస్తే మీరు మీ జీవితంలో సరైన మార్గంలో ఉన్నారని , రాబోయే సమయం చాలా బాగుంటుందని మీరు అర్థం చేసుకోవాలి.
- దుర్గాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు లేదా ఏదైనా వృద్ధ మహిళ లేదా స్త్రీ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు మీరు కలలో చూసినట్లయితే.., ఈ కలను మీ జీవితంలో మాతృదేవత ఆశీర్వాదంగా పరిగణించాలి.
- మీరు ఒక అమ్మాయిని పూజించడం చూస్తే..జీవితంలో గౌరవం, విజయం వస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. మీ పెండింగ్ పని త్వరలో పూర్తవుతుంది.
- మరోవైపు నవరాత్రి సమయంలో మీరు లక్ష్మీదేవి నుంచి డబ్బు లేదా ఏదైనా స్త్రీ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు కలలో కనిపిస్తే.. మీ ఆర్థిక పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని భావించాలి.
- స్వప్న శాస్త్రం ప్రకారం కలలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. మన భవిష్యత్తు సంకేతాలు కూడా వాటిలో దాగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని తదగుణంగా జీవితంలో నడుచుకోవాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు