Suriya: సూర్యకు చేతులెత్తి మొక్కాల్సిందే.. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారో తెలుసా?

Suriya: సూర్యకు చేతులెత్తి మొక్కాల్సిందే.. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారో తెలుసా?


ఇవి కూడా చదవండి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఈ నటుడికి భారీగా అభిమానులు ఉన్నారు. అయితే గత కొన్నేళ్ల నుంచి సూర్యకు సరైన హిట్ పడడం లేదు. అతను చేస్తోన్న సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. అయితే తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరడం లేదు. ముఖ్యంగా తెలుగు నాట సూర్యకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందుకు కారణం అతని సినిమాలే కాదు.. సామాజిక సేవా దృక్పథంతో చేస్తోన్న అతను మంచి పనులు.వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేసేందుకు ఈ స్టార్ హీరో ముందుంటాడు. ఇక అగరం అనే ఫౌండేషన్ నెలకొల్పి సూర్య చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మందిని ఉచితంగ చదివిస్తున్నాడీ స్టార్ హీరో. పేదలు, అనాథలను ఎంపిక చేసి వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు సూర్య. ఇందు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అగరం ఫౌండేషన్ స్కూల్ కోసం తమ ఇంటినే ఉదారంగా ఇచ్చేసిన గొప్ప మనసు సూర్యది. తాజాగా ఈ అగరం ఫౌండేషన్ ప్రారంభమై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఆదివారం సాయంత్రం ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. సూర్యతో పాటు అతని భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ, కమల్ హాసన్, డైరెక్టర్ వెట్రిమారన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటి దాకా 8 వేలమంది చదువు పూర్తి చేశారట. అందరూ డిగ్రీ పట్టాలు అందుకున్నారట.ఇందులో 1800 మంది ఇంజినీర్లు ఉంటే, డాక్టర్లయిన వారి సంఖ్య 51. వీళ్లందరూ అగరం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదికి వచ్చారు. అగరం ఫౌండేషన్ తమ జీవితాలు ఎలా మలుపు తిప్పిందో చెప్పుకొచ్చారు . ఈ సందర్భంగా వీరిని చూసి హీరో సూర్య ఎమోషనల్ అయ్యాడు. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సూర్య చేస్తున్న గొప్ప పనికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

8000మందికి పైగా..

ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *