సూర్య స్థాపించిన ఛారిటబుల్ ఫౌండేషన్, అగరం 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకకు కమల్ హసన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుక అనంతరం హీరో సూర్య, జ్యోతిక దంపతులు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తమ కుమార్తె దియా, కుమారుడు దేవ్ లతో కలిసి శ్రీవారి దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ఆలయం వెలుపల అభిమానులు, భక్తులు సూర్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో గుడిగూడారు. ఫోటోస్, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..
ఇదిలా ఉంటే.. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వస్తున్న సూర్య కుటుంబం ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఆ ఫోటోలలో సూర్య కూతురు దియా అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయ పద్దతిలో ఎంతో చక్కగా కనిపించింది. ఇదంతా పక్కన పెడితే.. అగరం ఫౌండేషన్ అనేది తమిళనాడులోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సూర్య స్థాపించిన సంస్థ. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు ఎంతో మంది నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. విధ్యా ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 6700 మంది పైగా మొదటి తరం గ్రాడ్యుయేట్లను తయారు చేసింది.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
అగరం సంస్థ 15 సంవత్సరాల కార్యక్రమంలో సూర్యతో పాటు ఆయన భార్య జ్యోతిక, పిల్లలు దియా, దేవ్, సోదరుడు, నటుడు కార్తీ, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు 3న చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్, ‘విదుతలై’ దర్శకుడు వెట్రి మారన్, ‘జై భీమ్’ చిత్రనిర్మాత టీజే జ్ఞానవేల్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..
#Suriya #Jyothika family at Tirupati ♥️ pic.twitter.com/UgNuFgz0Iv
— Happy Sharing By Dks (@Dksview) August 5, 2025
ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..