Super Star Krishna : అతడు న్యాచురల్ ఆర్టిస్ట్.. సూపర్ స్టార్ కృష్ణ మనసుకు నచ్చిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే..

Super Star Krishna : అతడు న్యాచురల్ ఆర్టిస్ట్.. సూపర్ స్టార్ కృష్ణ మనసుకు నచ్చిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే..


తెలుగు చలనచిత్ర చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ , విజయనిర్మలల జంట ఒక అరుదైన, చిరస్మరణీయమైన అధ్యాయం. వారి వృత్తిగత, వ్యక్తిగత ప్రస్థానాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు. మహిళల పట్ల చూపించే అపారమైన గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకుందని విజయనిర్మల తెలిపారు. కేవలం సొంత చెల్లి అయినా సరే తలవంచి మాట్లాడే సుగుణం కృష్ణ గారిదని, షాట్ పూర్తవగానే తన పని తాను చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. పేరుకు కృష్ణుడు అయినా, ఇంట్లో రాముడిలా ఆయన నడవడిక ఉండేదని ప్రశంసించారు. ఈ జంట 40కి పైగా చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. సాధారణంగా ఒకే జంట పదే పదే తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులకు కొంత విసుగు రావచ్చని, కానీ తమ విషయంలో మాత్రం ఆదరణ తగ్గలేదని వారు గుర్తుచేసుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న ఒక తెలియని అన్యోన్యత, తెరపై కనిపించే కెమిస్ట్రీనే దీనికి కారణమని కృష్ణ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఒకానొక దశలో సంవత్సరానికి పది సినిమాలు చేసినప్పుడు “మీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా సక్సెస్ అవ్వదు” అని కొందరు వ్యాఖ్యానించినట్లు కృష్ణ గారు తెలిపారు. అయితే, తన కెరీర్‌లో మళ్లీ సక్సెస్ వచ్చిందీ విజయనిర్మలతో కలిసి నటించిన చిత్రాలతోనే అని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ఫెయిల్యూర్‌ల తర్వాత వచ్చిన పగ సాధిస్తా చిత్రం ఆయన పుట్టినరోజున విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, సీతారామరాజు, పాడిపంటలు వంటి ఎన్నో రికార్డు సృష్టించిన చిత్రాలలో విజయనిర్మలే హీరోయిన్‌గా నటించి, వారిని హిట్ పెయిర్గా నిలబెట్టింది.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

ఒక పెద్ద విరామం తర్వాత, కృష్ణ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్‌లతో చిత్రాలు డైరెక్ట్ చేసినప్పటికీ, కన్నడ చిత్రం అంతం కానిది ఆరంభం చూసి, అందులోని వేషాన్ని తనే చేస్తానని విజయనిర్మల ముందుకు వచ్చి, కృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించి మరో సూపర్ హిట్ అందించింది. సీతారామరాజు విడుదలైన తర్వాత తాను నటించిన 14 చిత్రాలు వరుసగా ఫెయిల్ అయినప్పుడు, “ఇక తన పని అయిపోయిందనుకున్నారు అందరూ” అని కృష్ణ గారు గుర్తుచేసుకున్నారు. అప్పుడు విజయనిర్మల హీరోయిన్‌గా నటించిన పాడిపంటలు చిత్రాన్ని సొంతంగా నిర్మించి, ఒకే షెడ్యూల్‌లో ఆంధ్ర లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రం అప్పట్లో 25 వారాలు ప్రదర్శింపబడి సూపర్ డూపర్ హిట్ అయింది, ఇది తన కెరీర్‌కు ఒక గొప్ప కమ్‌బ్యాక్‌గా నిలిచింది అని కృష్ణ వివరించారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు న్యాచురల్ ఆర్టిస్ట్ అంటూ ప్రశంసలు కురిపించారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *