మిథునం: ఈ రాశికి తృతీయ స్థానాధిపతి అయిన రవి భాగ్య స్థానంలో చేరడం వల్ల అప్రయత్న ధన లాభం, అధికార యోగం వంటి వాటికి బాగా అవకాశం ఉన్నప్పటికీ, తోబుట్టువులు, తండ్రి, దగ్గర బంధువులతో వివాదాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రితో ఆస్తి, సంపదకు సంబంధించిన విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలు వైన వస్తువులు కోల్పోవడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు అడుగంటుతాయి.
కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. విధులు, బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు జరగడం వల్ల అధికారుల నమ్మకాన్ని కోల్పోతారు. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాల మీద డబ్బు వృథా అవుతుంది. తండ్రి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతారు.
సింహం: రాశ్యధిపతి రవి సప్తమ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది కానీ, తండ్రితోనూ, జీవిత భాగస్వామితోనూ విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. రాజపూజ్యాలు తగ్గి అవమానాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృక్తిగత, ఆర్థిక సమస్యల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడితో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామి వైఖరి కారణంగా ప్రేమ వ్యవహారాలు తీవ్రస్థాయి అసంతృప్తి కలిగిస్తాయి.
కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల తండ్రి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యో గంలో అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. పని భారం, పని ఒత్తిడి బాగా పెరుగుతాయి. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి, వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం కాకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి తగ్గుతుంది.
ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. కుటుంబ సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా ఒక పట్టాన సక్సెస్ కాకపోవచ్చు. ప్రయాణాల వల్ల బాగా నష్టపోతారు. మిత్రులు, సన్నిహితుల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. మాట ఇచ్చి ఇబ్బంది పడతారు.
మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల రాజపూజ్యాల కంటే అవమానాలు ఎక్కువగా అను భవానికి వస్తాయి. కోర్టు కేసుల్లో అపజయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసర పరిచయాలతో ఇబ్బంది పడతారు. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆశాభంగాలు ఎదురవుతాయి. ప్రభుత్వ అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా తగ్గుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించకపోవచ్చు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.





