Success Story: ఆటో డ్రైవర్ కుమార్తె నీట్ పరీక్షలో ఉత్తీర్ణత.. వైద్య విద్యార్థినిగా మారేందుకు రూబీ ప్రయాణం.. నేటి తరానికి స్పూర్తి

Success Story: ఆటో డ్రైవర్ కుమార్తె నీట్ పరీక్షలో ఉత్తీర్ణత.. వైద్య విద్యార్థినిగా మారేందుకు రూబీ ప్రయాణం.. నేటి తరానికి స్పూర్తి


వైద్య వృత్తిని చేపట్టడం చాలా మందికి ఒక అందమైన కల. తమ కలని నిజం చేసుకోవాలంటే.. నీట్ యుజి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇది చాలా కష్టం. ముఖ్యంగా వనరుల కొరత, ఆర్ధిక పరిస్థతి అంతంత మాత్రమే ఉన్న స్టూడెంట్స్ కు నీట్ పరీక్ష అనేది అందని ద్రాక్ష అని చెప్పవచ్చు. అయితే పరిస్థితులకు ఎదురీది కృషి, పట్టుదలతో తన అభిరుచి బలాన్ని జోడించి రుబీ ప్రజాపతి తన లక్ష్యాన్ని సాధించింది. రూబీ నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆటో డ్రైవర్. పేదరికంతో పోరాడుతూనే రూబీ డాక్టర్ చదవాలనే తన కలని నిజం చేసుకుంది. నాలుగో ప్రయత్నాలు విఫలం అయినా నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా విజయం సాధించింది.

కుటుంబానికి ఆటోనే జీవనాధారం
రుబీది గుజరాత్ కు చెందిన కుటుంబం. రూబీకి తల్లిదండ్రులు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. రూబీతో సహా నలుగురు సభ్యులు. అటో నడపగా వచ్చిన సంపాదనతోనే తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే రుబీ అన్న సరిగ్గా మాట్లాడలేదు. రుబీ తమ్ముడు అకస్మాత్తుగా వ్యాధి బారిన పడ్డాడు. రూబీ తండ్రి కొడుక్కి సరైన చికిత్స చేయించ లేకపోయాడు. దీంతో అతను మరణించాడు.

తమ్ముడిని కోల్పోయిన తర్వాత డాక్టర్ కావాలని నిర్ణయించుకున్న రుబీ
రూబీ పేదరికం కారణంగా తన సోదరుడిని కోల్పోయింది. ఆమె ఇప్పటికీ దీని గురించి బాధపడుతోంది. ఆమె జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఇదే కారణం. రూబీ ఏకైక కల డాక్టర్ అయి తమలాంటి పేదవారికి చికిత్స చేయడమే. ఆమె తన గ్రామంలో వైద్య సౌకర్యాలను బలోపేతం.. వైద్యం ప్రతి ఒక్కరికీ అందేలా చేయాలని కోరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

నాలుగు ప్రయత్నాలలో విఫలమైనా
రూబీ నీట్ యుజి పరీక్ష రాయడం మొదలు పెట్టింది. మొదటి నాలుగు ప్రయత్నాలలో విఫలమైంది. అయినా నిరాస పడలేదు. తన పట్టుదలను వదలలేదు. రూబీ తన తప్పుల నుంచి నేర్చుకుంటూనే ఉంది. 2023 సంవత్సరంలో మరోసారి నీట్ కి పరీక్షకు హాజరైంది. ఈసారి ఆమె విజయం సాధించింది. ఆమె 5వ ప్రయత్నంలో 635 మార్కులతో నీట్ యుజి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.

ఏ కాలేజీ నుంచి MBBS చేస్తోందంటే
రూబీ ప్రజాపతి ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ వర్ధమాన్ మెడికల్ కాలేజీలో MBBS చదువుతోంది. రూబీ 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. దీని తరువాత కొంతమంది బంధువులు, తండ్రి స్నేహితుడి సహాయంతో రుబీ నీట్ పరీక్షకు సిద్ధం అయ్యేందుకు ఫీజుని చెల్లించింది. తాము ఉండే చోట ఇరుగుపొరుగు పిల్లలకు ట్యూషన్ చెప్పి డబ్బులను సంపాదించుకునేది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *