టెక్నాలజీని ఉపయోగించి కొత్త స్టార్టప్‌లు ప్రారంభించే కంపెనీలు మూలధనాన్ని అందించడం, వెంచర్ క్యాపిటల్ బేస్‌ను బలపరచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 అనే కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. తయారీ రంగం, కొత్త టెక్నాలజీలలో పనిచేస్తున్న ప్రారంభ దశ స్టార్టప్‌లను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పథకం ఎంతగానో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 10 వేల కోట్లతో స్పెషల్ ఫండ్స్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ సంబంధిత ఫైళ్లపై సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది.
అసలు స్టార్టప్ ఇండియా 2.0 ఎలా పనిచేస్తుంది?
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్టార్టప్ ఇండియా 2.0 అనేది డీప్ టెక్, తయారీ రంగం, కొత్త టెక్నాలజీలలో స్టార్టప్‌లు స్టార్ట్ చేసే వారికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుంది. అలాగే ఎక్కువ కాలంపాటు క్యాపిటల్ ఫండ్ అవసరమైన మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లోని స్టార్టప్‌లకు కూడా ఇది ఎక్కవ సపోర్ట్ ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా స్టార్టప్‌లు ప్రారంభం దశలోనే ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి వాటికి ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ స్టార్టప్ ఇండియా అనేది నేరుగా స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టకుండా, ఇతర వెంచర్ క్యాపిటల్ లేదా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ద్వారా పెట్టుబడు పెడుతుంది. ఇలా చేయడం ద్వారా పెట్టుబడిలో రిస్క్ తక్కువగా ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.