సోనీ ఇండియా తన బ్రావియా థియేటర్ ఆడియో పోర్ట్‌ఫోలియోకు రెండు కొత్త ఉత్పత్తులను చేర్చింది. బ్రావియా థియేటర్ సిస్టమ్ 6, 5.1 ఛానల్ వైర్‌లెస్ సరౌండ్ సిస్టమ్, బ్రావియా థియేటర్ బార్ 6, 3.1.2 ఛానల్ సౌండ్‌బార్‌లను రిలీజ్ చేసింది. ఇంట్లోనే సినిమాటిక్ ఆడియో నాణ్యతను అందించడానికి ఈ ఉత్పత్తులు రూపొందించామని కంపెనీ ప్రకటించింది. ఈ ఉత్పత్తుల్లో డాల్బీ అట్మాస్, డీటీఎస్:ఎక్స్‌తో పాటు సోనీకు సంబంధించిన అధునాతన ఇమ్మర్సివ్ సౌండ్ టెక్నాలజీ ఆకట్టుకుంటుంది. బ్రావియా థియేటర్ సిస్టమ్ 6 నిజమైన 5.1 ఛానల్ కాన్ఫిగరేషన్ ద్వారా 1000 వాట్స్ సౌండ్ క్వాలిటీను అందిస్తుంది. వైర్‌లెస్ రియర్ స్పీకర్ల వల్ల ఇంట్లోనే మినిమలిస్ట్ సెటప్ కోసం చూస్తున్న వారికి మంచి ఎంపికగా ఉంటుంది. బ్రావియా థియేటర్ బార్ 6 రెండు అప్‌ఫైరింగ్ స్పీకర్లు, వైర్‌లెస్ సబ్ వూఫర్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గేమింగ్ సెషన్‌లకు అనువుగా ఉంటుంది.
సోనీ బ్రావియా రిలీజ్ చేసిన ఈ రెండు ఉత్పత్తులు డాల్బీ అట్మాస్, డీటీఎస్:ఎక్స్, సోనీ వర్టికల్ సరౌండ్ ఇంజిన్, ఎస్-ఫోర్స్ ప్రో ఫ్రంట్ సరౌండ్‌లను ఉపయోగించి 360 డిగ్రీల ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ముఖ్యంగా భారతీయ కంటెంట్ వినియోగ అలవాట్లకు అనుగుణంగా ఈ కొత్త ఉత్పత్తులు రిలీజ్ చేశారు. వాయిస్ జూమ్ 3తో పాటు నైట్ మోడ్, వాయిస్ సెంట్రలైజ్డ్ కంటెంట్ కోసం వాయిస్ మోడ్ వంటి ప్రత్యేక మోడ్‌లు ఆకర్షిస్తాయి. అలాగే సిస్టమ్ 6 మల్టీ స్టీరియో మోడ్ వల్ల అన్ని స్పీకర్లలో ధ్వనిని సమానంగా ఉంటుంది. ఈ రెండు మోడళ్లు బ్రావియా కనెక్ట్ యాప్ ద్వారా సోనీ బ్రావియా టీవీలతో సజావుగా అనుసంధానించుకోవచ్చు. వాల్యూమ్, సౌండ్ మోడ్‌లు, ఇతర సెట్టింగ్‌లను టీవీ రిమోట్‌ని ఉపయోగించి చేసుకోవచ్చు. ముఖ్యంగా టీవీ క్విక్ సెట్టింగ్‌ల మెనూ ద్వారా నేరుగా సర్దుబాటు చేయవచ్చు.
ఈ రెండు ఉత్పత్తులు రీసైకిల్ చేసిన పీఈటీ ఫాబ్రిక్, కనీస ప్లాస్టిక్ ప్యాకేజింగ్, తగ్గించిన ఇంక్ వాడకంతో సోనీ తన స్థిరత్వ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. యాక్సెసిబిలిటీ లక్షణాల్లో బ్రావియా కనెక్ట్ యాప్ ద్వారా టచ్ మార్కర్లు, స్క్రీన్ రీడర్ మద్దతు ఆకట్టుకుంటుంది. బ్రావియా థియేటర్ బార్ 6 (3.1.2 ఛానల్) ఇప్పటికే భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. దీని ధర ర.39,990గా ఉంది. అలాగే బ్రావియా థియేటర్ సిస్టమ్ 6 (5.1 ఛానల్) జూలై 3, 2025 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ ఉత్పత్తి ధర రూ.49,990గా ఉంటుంది. దేశంలోని సోనీ సెంటర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్స్ రిటైలర్లతో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ఈ రెండు సోనీ ప్రొడెక్ట్స్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి