మీ మొబైల్‌కు ఎప్పుడు కూడా ఒరిజినల్ ఛార్జీర్‌ను మాత్రమే వాడాలి. చాలా మంది డూప్లికేట్, లేదా వేరే మోడల్‌కు చెందిన ఛార్జర్‌ను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా మొబైల్ త్వరగా హీటెక్కిపోతుంటుంది. ఇక చాలా మంది మొబైల్ యూజర్లు నేవిగేషన్ కోసం జీపీఎస్ ఆన్ చేస్తుంటారు. అవసరం తీరాక వెంటనే జీపీఎస్‌ను ఆఫ్ చేయాలి. కొందరు ఎప్పుడు కూడా ఆన్‌లో ఉంచడం వల్ల మొబైల్ హీటెక్కిపోతుంటుంది. అందుకే ఆఫ్ చేసుకోవడం ఉత్తమం.