Headlines

Smart Shopping Tips: షాపింగ్‌కు వెళుతున్నారా? ఈ 8 టిప్స్ గుర్తుంచుకుంటే అనవసర ఖర్చులకు చెక్ 

Smart Shopping Tips: షాపింగ్‌కు వెళుతున్నారా? ఈ 8 టిప్స్ గుర్తుంచుకుంటే అనవసర ఖర్చులకు చెక్ 


డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి కదా అని ఎగబడితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అసలైన పొదుపు అనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడం లోనే ఉంటుంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండానే డబ్బును ఎలా ఆదా చేయవచ్చు? ఆన్‌లైన్‌లో లేదా స్టోర్లలో షాపింగ్ చేసేటప్పుడు ప్రో-షాపింగ్ టిప్స్ ఎలా పాటించాలో చూద్దాం.

  • అప్పటికప్పుడు ఏదో ఒకటి నచ్చి కొనడం అనేది మీ బడ్జెట్ ను నాశనం చేస్తుంది. అందుకే షాపింగ్‌కు వెళ్లే ముందే మీకు కావాల్సిన వస్తువుల జాబితాను ఒక కాగితం మీద రాసుకోండి. ఆ జాబితాలో లేని వస్తువులను ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే కొనకూడదు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా, వేల రూపాయల డబ్బును ఆదా చేస్తుంది.
  • షాపింగ్ ప్రారంభించే ముందే మీరు ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి రండి. ముఖ్యంగా పండుగలు, భారీ సేల్స్ సమయంలో ఈ బడ్జెట్ కట్టుబాటు చాలా అవసరం. పరిమితిని ముందే అనుకోవడం వల్ల అనవసరమైన వస్తువులపై దృష్టి మళ్లకుండా ఉంటుంది.
  • వస్తువుల ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు దాని ధరను గమనించండి. దీనివల్ల అసలైన డిస్కౌంట్ ఎప్పుడు వస్తుందో మీకు అర్థమవుతుంది. కొన్ని బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్లు లేదా యాప్స్ ధరలు తగ్గినప్పుడు మీకు అలర్ట్స్ పంపిస్తాయి, వాటిని వాడుకోవడం మంచిది.
  • చాలా బ్రాండ్లు తమ వెబ్ సైట్ లో ఫస్ట్ టైమ్ కొనుగోలు చేసే వారికి లేదా ఈమెయిల్ సైన్-అప్ చేసిన వారికి ప్రోమో కోడ్లు ఇస్తాయి. అలాగే కొన్ని క్యాష్ బ్యాక్ సైట్ల ద్వారా షాపింగ్ చేస్తే మీ అకౌంట్లోకి కొంత డబ్బు వెనక్కి వస్తుంది. ఈ చిన్న చిన్న మొత్తాలే చివరికి పెద్ద ఆదాగా మారుతాయి.
  • పెద్ద వస్తువులు అంటే గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్స్, ఖరీదైన దుస్తులు వంటివి కొనేటప్పుడు టైమింగ్ చాలా ముఖ్యం. పండుగ సీజన్లలో లేదా ఎండ్-ఆఫ్-సీజన్ సేల్స్ సమయంలో వీటిపై భారీ తగ్గింపులు ఉంటాయి. సీజన్ ముగిసిన తర్వాత తదుపరి సీజన్ వస్తువులను కొంటే సగం ధరకే వచ్చే అవకాశం ఉంటుంది.
  • మొదటి వెబ్ సైట్ లో కనిపించిన ధరకే వస్తువును ఆర్డర్ చేయకండి. కనీసం రెండు మూడు ఇతర సైట్లలో లేదా దగ్గరలోని స్టోర్లలో ధర ఎంత ఉందో చెక్ చేయండి. కొన్ని చోట్ల ఉచిత డెలివరీ లేదా అదనపు బ్యాంక్ ఆఫర్లు ఉండవచ్చు. పోల్చి చూడటం వల్ల మీరు మోసపోకుండా ఉంటారు.
  • తక్కువ ధరకు వస్తుందని నాణ్యత లేని వస్తువులను పదే పదే కొనడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ ఖర్చవుతుంది. ఒకేసారి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినా, ఎక్కువ కాలం మన్నిక వచ్చే నాణ్యమైన వస్తువులను ఎంచుకోవడం తెలివైన పని. ఇది మీకు డబ్బుతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.
  • బోర్ కొడుతుందని, స్ట్రెస్ గా ఉందని లేదా సెలబ్రేట్ చేసుకోవాలని షాపింగ్ చేస్తే అది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయాలకే దారితీస్తుంది. ఏదైనా వస్తువు కొనే ముందు ఒకసారి గాలి పీల్చుకుని.. ‘ఇది నాకు నిజంగా అవసరమా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ క్షణం కలిగే కోరిక కంటే మీ ఆర్థిక భద్రతే ముఖ్యం.
    స్మార్ట్ షాపింగ్ అంటే తక్కువ ఖర్చు పెట్టడం మాత్రమే కాదు, మీ ప్రతి పైసాకు సరైన విలువను పొందడం. కొంచెం ప్లానింగ్, స్వయం నియంత్రణ ఉంటే అనవసర ఖర్చుల నుంచి తప్పుకోవచ్చు. షాపింగ్ చేసిన తర్వాత గిల్టీగా ఫీలవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *