Shubman Gill : శుభమన్ గిల్ ఆట చూసి ఫిదా అయి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన గవాస్కర్.. వీడియో వైరల్

Shubman Gill : శుభమన్ గిల్ ఆట చూసి ఫిదా అయి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన గవాస్కర్.. వీడియో వైరల్


Shubman Gill : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఓవల్ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్‌కు భారత్ 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, మూడో రోజు ఆట ముగిసిన తర్వాత మ్యాచ్ పరిస్థితి కంటే, క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఒక సంఘటన జరిగింది. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గిల్ ఏకంగా 754 పరుగులు సాధించాడు. అతని అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఓవల్ టెస్ట్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత గిల్‌కు ఒక స్పెషల్ గిఫ్ట్ అందించారు.

గవాస్కర్ గిల్‌కు ఒక కస్టమ్ SG షర్ట్‌ను బహుకరించారు. ఈ షర్ట్‌పై ఉన్న ‘SG’ కేవలం ఆ బ్రాండ్‌ను మాత్రమే సూచించదు, అది సునీల్ గవాస్కర్, శుభ్‌మన్ గిల్ అనే ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలకు కూడా ప్రతీక. ఈ షర్ట్‌తో పాటు, గవాస్కర్ తన సంతకం చేసిన ఒక క్యాప్‌ను కూడా టీమిండియా కెప్టెన్ గిల్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ.. తాను ఈ క్యాప్‌ను చాలా ప్రత్యేకమైన ఆటగాళ్లకు మాత్రమే ఇస్తానని చెప్పారు. ఇది గిల్ సాధించిన విజయాలపై గవాస్కర్‌కు ఎంత గౌరవం ఉందో తెలియజేస్తుంది. ఈ వీడియోను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గవాస్కర్ ఒక ఐకానిక్ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు. ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఓపెనర్‌గా ఇప్పటికీ గవాస్కర్ (774 పరుగులు) పేరు మీదే రికార్డు ఉంది. గిల్ 754 పరుగులతో ఆ రికార్డుకు కేవలం 21 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయినప్పటికీ, అతని ప్రదర్శనను అందరూ ప్రశంసించారు. గవాస్కర్ ఇచ్చిన బహుమతి, ఒక తరం నుంచి మరో తరానికి బాధ్యతలను అప్పగించే ఒక అపురూపమైన క్షణంగా నిలిచింది. ఇది అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే క్షణం.

మరిన్ని  క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *