Shubman Gill: తన రోల్‌ మోడల్‌ కోహ్లీకి అదిరిపోయే ట్రిబ్యూట్‌ ఇచ్చిన కెప్టెన్‌ గిల్‌! అదేంటో తెలిస్తే వావ్‌ అంటారు..

Shubman Gill: తన రోల్‌ మోడల్‌ కోహ్లీకి అదిరిపోయే ట్రిబ్యూట్‌ ఇచ్చిన కెప్టెన్‌ గిల్‌! అదేంటో తెలిస్తే వావ్‌ అంటారు..


ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్లింది. ఈ భారీ స్కోర్‌లో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌దే కీలక పాత్ర. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న గిల్‌.. 114 వ్యక్తిగత స్కోర్‌ వద్ద రెండో రోజు ఆట మొదలుపెట్టిన గిల్‌.. ఏకంగా డబుల్‌ సెంచరీ బాదేశాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులతో 269 పరుగులు చేసి.. కొద్దిలో ట్రిపుల్‌ సెంచరీ చేసే గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ అయ్యాడు. అది మిస్ అయితే అయింది కానీ.. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత గిల్‌ నెక్ట్స్‌ లెవెల్‌కి వెళ్లిపోయాడని చెప్పాలి. ఏం కొట్టాడు.. ఏం కొట్టాడు.. ఇంగ్లాండ్‌ బౌలర్లకు, కెప్టెన్‌కు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. గిల్‌ స్టైలిష్‌ బ్యాటింగ్‌కు క్రికెట్‌ అభిమానులతో పాటు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కూడా ఫిదా అయిపోయారనే చెప్పాలి.

గిల్‌ దెబ్బకు టీమిండియా 587 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అయితే ఈ సూపర్‌ ఇన్నింగ్స్‌తో గిల్‌ తన అభిమాన ఆటగాడు విరాట్‌ కోహ్లీకి అన్‌ అఫీషియల్‌గా అదిరిపోయే ట్రిబ్యూట్‌ ఇచ్చాడని క్రికెట్ అభిమానులు చెప్పుకుంటున్నారు. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీ గొప్ప కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే టెస్ట్‌ ఫార్మాట్‌లో నాలుగో స్థానంలో కొన్నేళ్లుగా కోహ్లీనే బ్యాటింగ్‌ చేశాడు. ఇప్పుడు కోహ్లీ వారుసుడిగా ఆ నాలుగో స్థానంలో గిల్‌ బరిలోకి దిగుతున్నాడు. అలాగే కెప్టెన్‌గా కోహ్లీ నెలకొల్పిన ఎన్నో రికార్డులు కూడా కెప్టెన్‌గా గిల్‌ను ఊరిస్తూ ఉంటాయి. ఇండియన్‌ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ తర్వాత నెక్ట్స్‌ సూపర్‌ స్టార్‌ అతనే అంటూ ఇప్పటికే కొంతమంది అభిమానులు అంటున్నారు.

అలాంటి గిల్‌.. కోహ్లీకి తన 269 పరుగుల ఇన్నింగ్స్‌తో ట్రిబ్యూట్‌ ఇచ్చాడు. అదేంటి గిల్‌ ఇన్నింగ్స్‌ కోహ్లీకి ట్రిబ్యూట్‌ ఎలా అవుతుందని అనుకుంటున్నారా? దానికి ఒక లాజిక్‌ ఉంది లేండి.. అదేంటంటే.. గిల్‌ 269 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ క్యాప్‌ నంబర్‌ కూడా 269. ఇటీవలె కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అంతా థ్యాంక్యూ 269 అంటూ కోహ్లీకి రిటైర్మెంట్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు గిల్‌ 269 ఇన్నింగ్స్‌తో ఆ 269 క్యాప్‌ నంబర్‌ ప్లేయర్‌ కోహ్లీకి ట్రిబ్యూట్‌ ఇచ్చినట్లు అయింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినా.. బాగుంది. పైగా కోహ్లీ అంటే గిల్‌కు ఎంతో అభిమానం. కెప్టెన్‌గా కోహ్లీ అడుగుజాడల్లో నడుస్తానని కూడా గిల్‌ గతంలో ప్రకటించాడు. కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకున్నానని కూడా తెలిపాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *