పంజాబ్ కింగ్స్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన శ్రేయాస్ అయ్యర్ గురించి ఎంత చెప్పిన తక్కువే. తన లీడర్ షిప్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లాండ్ టూర్‌కు సెలక్ట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సెలక్టర్లు అతడిని పక్కనబెట్టారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్‌లో ఆడతాడని తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు శ్రేయాస్ అయ్యర్‌కు టీమిండియాలో చోటు ఇవ్వొచ్చనే ప్రచారం జోరందుకుంది.
నివేదికల ప్రకారం.. ఆగస్టు మూడవ లేదా నాల్గవ వారంలో ఆసియా కప్‌కు టీమిండియాను సెలక్ట్ చేస్తారు. దీంతో పాటు వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు కూడా జట్టును ఎంపిక చేస్తారు. శ్రేయాస్ అయ్యర్‌కు ఈ రెండు జట్లలోనూ అవకాశం లభిస్తుందని అంటున్నారు. జట్టుకు అనుభవం అవసరం కాబట్టి, శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్, టెస్ట్ ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చే ఆటగాళ్లలో ముందు వరసలో ఉన్నాడు. అయ్యర్‌కు అంతర్జాతీయ క్రికెట్లో మంచి అనుభవం ఉంది.అందువల్ల, సెలెక్టర్లు అయ్యర్‌కు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అయ్యర్ ఆసియా కప్‌లో మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయ్యర్ స్పిన్ బౌలింగ్‌న ధీటుగా ఎదుర్కోగలడు. అందువల్ల వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌లకు అతన్ని కచ్చితంగా సెలక్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ వెస్ట్ జోన్ జట్టు తరపున ఆడతాడు.
అయ్యర్ ఐపీఎల్లో్ అద్భుతంగా రాణించాడు. టోర్నమెంట్లో 175 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు చేశాడు. అయ్యర్ బ్యాటింగ్ సగటు కూడా 50 కంటే ఎక్కువగా ఉంది. అతని కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ IPL ఫైనల్‌కు చేరుకుంది. కానీ టైటిల్ రేసులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..