శ్రావణ పౌర్ణమి పండుగ 2025 లో ఆగస్టు 9వ తేదీన జరుపుకో నున్నారు. ఈ రోజున రక్షాబంధన్ పండగని జరుపుకోవడానికి సోదర సోదరీమణులు రెడీ అవుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈసారి శ్రవణ పూర్ణిమ రోజున అరుదైన యోగాల కలయిక జరగనుంది. సౌభాగ్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శ్రావణ నక్షత్రంల శుభ కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ పూర్ణిమ ప్రాముఖ్యత చాలా రెట్లు పెరిగింది. దీనితో పాటు ఈ రోజున బుధ గ్రహం కూడా ఉదయిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఏ రాశులకు అత్యంత శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం..
మిథున రాశి: శ్రావణ పూర్ణిమ రోజున ఏర్పడే శుభ యోగాలు ఈ రాశికి చెందిన వ్యక్తుల విజయానికి కొత్త మార్గాలను తెరుస్తాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో భవిష్యత్తులో వీరు అపారమైన ప్రయోజనాలను అందించే కొంతమంది వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. లక్ష్మీ దేవి మిథున రాశి వారిపై ఆశీస్సులను కురిపిస్తుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ వీరికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి.
ఇవి కూడా చదవండి
మీన రాశి వారు: శ్రావణ పౌర్ణమి రోజున ఏర్పడనున్న శుభయోగాలతో మీన రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు చాలా లాభం పొందుతారు. కుబేరుడు దయ ఈ రాశికి చెందిన వ్యక్తుల పై ఉండి వీరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాడు. కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు పూర్తవుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.