హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇప్పుడు హే భగవాన్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తన ప్రయాణం, కెరీర్ ఎదుగుదలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ వృద్ధి గురించి మాట్లాడుతూ, 2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నానని, 2025 నాటికి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నానని, 2026 నాటికి పూర్తి కమర్షియల్ నటిగా మారుతున్నట్లు అనిపిస్తుందని అన్నారు. తాను సినిమాల ఎంపికలో “క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ”కి ప్రాధాన్యత ఇస్తానని, ఎన్ని సినిమాల్లో నటించామన్నది కాదని, ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించామన్నదే ముఖ్యమని నమ్ముతానని వెల్లడించారు.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‌లో సంచలనంగా మారింది..
ప్రస్తుతం తాను నటిస్తున్న హే భగవాన్ చిత్రం గురించి మాట్లాడుతూ, సినిమాలో ఒక మిస్టరీ బిజినెస్ ఉందని, సుహాస్ వాయిస్‌తో వచ్చే డిస్‌క్లెయిమర్ వల్ల దానిపై ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొందని తెలిపారు. ఆ బిజినెస్ ఏమిటని చాలా మంది అడుగుతున్నారని, అయితే అది సినిమా చూస్తేనే దాని కిక్ తెలుస్తుందని, మొదటి అర్ధభాగంలోనే ఆ రహస్యం వీడుతుందని శివాని పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఈ చిత్రంలో తన పాత్ర ఒక సాంప్రదాయక, పద్ధతైన కుటుంబానికి చెందిన అమ్మాయి అని, తన తల్లిదండ్రులు తెలుగు భాషను బాగా ఇష్టపడతారని వివరించారు. ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా.. నేనింకా యాక్టింగ్ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చింది.
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..