జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ సోమవారం ఉదయం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 81 ఏళ్ల శిబు సోరెన్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని గంగారం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.. కొంతకాలంగా శిబు సోరెన్ కిడ్నీసంబంధ సమస్యతోపాటు.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబుసోరెన్.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఈరోజు ఉదయం 8:48 గంటలకు కన్నుమూశారు. ఆయనను గంగారాం ఆసుపత్రిలోని నెఫ్రోడ్ విభాగంలో చేర్చారు. ఆయనకు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీనితో పాటు, ఆయన శరీరంలో మరికొన్ని సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ గురూజీ మనందరినీ విడిచిపెట్టారంటూ బాధాతప్త హృదయంతో పేర్కొన్నారు.