ఇక బిజినెస్ లెక్కల విషయానికొస్తే.. ఓ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 20, 25 లీటర్ క్యాన్ అయితే రూ. 10 నుంచి రూ. 15 తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు టిన్ కూడా ఇవ్వాల్సి వస్తే క్యాన్ రూ. 300 నుంచి రూ. 350 వరకు అమ్ముతారు. ఇలా రోజుకు వాటర్ బాటిళ్లు, 25 లీటర్ల క్యాన్లు కలిపి వెయ్యి వరకు అమ్మితే.. రూ. 20 వేల ఆదాయం వస్తుంది. అలా నెలకు రూ. 6 లక్షల ఆదాయం మీ సొంతం. కరెంట్ బిల్లు, సర్వీసులు, ఇతరత్రా ఖర్చులకు రూ. రెండున్నర లక్షలు పోయినా.. సుమారు 3 లక్షల వరకు మీకు లాభం వస్తుంది.