ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై దూసుకుపోతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు. అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణ మధ్య తరగతి కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ సీరియల్ కు రోజు రోజుకీ విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇందులో ప్రధాన పాత్రలు బాలు, మీనా జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మీనా గురించి చెప్పుకుంటే.. అందంతోపాటు పద్దతిగా చీరకట్టులో కనిపిస్తూ అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. మీనా అసలు పేరు అమూల్య గౌడ. కన్నడ సినీరంగానికి చెందిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువే.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
సీరియల్లో పద్దతిగా కనిపించే అమూల్య.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. నెట్టింట ఈ అమ్మడు చేసే అరాచకం గురించి చెప్పక్కర్లేదు. మైసూర్ కు చెందిన అమూల్య గౌడ.. దాదాపు పదేళ్ల క్రితం సినీప్రయాణం స్టార్ట్ చేసింది. కన్నడ సీరియల్ స్వాతి ముత్తుతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత కోమలి సీరియల్ ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ఈ అమ్మడు.. కార్తీక దీపం సీరియల్లో శౌర్య పాత్రతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో రౌడీ బేబీగా మరింత పాపులర్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
ఆ తర్వాత గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనా పాత్రతో మరింత పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సీరియల్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్ తో హీటెక్కిస్తుంది. ఇదిలా ఉంటే.. అమూల్య గౌడ ఒక్క ఎపిసోడ్ కోసం రూ.30 నుంచి రూ.35 వేలు తీసుకుంటుందట. ఇప్పుడు ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..