కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2025 సంవత్సరానికిగానూ.. దేశంలోని వివిధ బ్రాంచుల్లో ప్రొబేషన్ ఆఫీసర్ (పీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 541 పీఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జూన్ 24వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగరీల వారీగా ఖాళీల వివరాలు..
- ఎస్సీ కేటగరీలో పోస్టుల సంఖ్య: 80
- ఎస్టీ కేటగరీలో పోస్టుల సంఖ్య: 73
- ఓబీసీ కేటగరీలో పోస్టుల సంఖ్య: 135
- ఈడబ్ల్యూఎస్ కేటగరీలో పోస్టుల సంఖ్య: 50
- యూఆర్ కేటగరీలో పోస్టుల సంఖ్య: 203
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్, ఇంజినీరింగ్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 30, 2025 లోగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 01, 2025వ తేదీ నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు జులై 14, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఫేజ్-I ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్-II మెయిన్ పరీక్ష, ఫేజ్-III (సైకోమెట్రిక్ పరీక్ష + గ్రూప్ డిస్కషన్ + ఇంటర్వ్యూ) ఆధారంగా తేది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 జీతంతోపాటు అడ్వాన్స్ ఇంక్రిమెట్లు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పీఎఫ్, ఎన్‌పీఎఫ్ వంటి ఇతర అలవెన్సులు లభిస్తాయి.
ఇవి కూడా చదవండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.