SBI అమృత్ వృష్టి FD.. కేవలం 444 రోజుల్లోనే రూ.5.35 లక్షలు మీ సొంతం!

SBI అమృత్ వృష్టి FD.. కేవలం 444 రోజుల్లోనే రూ.5.35 లక్షలు మీ సొంతం!


SBI అమృత్ వృష్టి FD.. కేవలం 444 రోజుల్లోనే రూ.5.35 లక్షలు మీ సొంతం!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లు తగ్గించిన ప్రభావం బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీలపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ బ్యాంకుల్లో FD రేట్లు ఇటీవల కనిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. అయినప్పటికీ డిపాజిటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలతో బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన అమృత్ వృష్టి స్పెషల్ FD స్కీమ్‌తో ఆకర్షిస్తోంది.

ముందుగా 400 రోజుల అమృత్ కలశ్ పథకం ద్వారా అధిక వడ్డీ ఇచ్చిన ఎస్బీఐ, RBI రేటు కోతల తర్వాత దానిని నిలిపివేసి 444 రోజుల కొత్త టెన్యూర్‌తో అమృత్ వృష్టి స్కీమ్‌ను ప్రారంభించింది. ప్రారంభంలో ఈ పథకంపై సాధారణ ఖాతాదారులకు 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ ఇచ్చిన బ్యాంక్, తరువాత రెండు సార్లు రేట్లు తగ్గించింది.

ప్రస్తుతం ఈ స్కీమ్‌లో సాధారణ ప్రజలకు 6.45 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.95 శాతం వడ్డీ లభిస్తోంది. ఇతర టెన్యూర్లతో పోలిస్తే ఇదే ఎస్బీఐలో అత్యధిక వడ్డీగా ఉంది. సాధారణ FDల్లో వారం నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ఖాతాదారులకు 3.05 శాతం నుంచి 6.40 శాతం మధ్య, సీనియర్లకు 3.55 శాతం నుంచి 6.95 శాతం మధ్య వడ్డీ ఉంది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

రూ.5 లక్షలు పెట్టితే ఎంత వస్తుందంటే?

  • సాధారణ ఖాతాదారు (6.45 శాతం వడ్డీ రేటు): 444 రోజులకు వడ్డీ రూ.33,038తో కలిపి మొత్తం రూ.5,33,038 వస్తుంది.
  • సీనియర్ సిటిజన్ (6.95 శాతం): వడ్డీ రూ.35,666తో కలిపి మొత్తం రూ.5,35,666 వస్తుంది.

మొత్తానికి వడ్డీ రేట్లు తగ్గిన సమయంలో కూడా తక్కువ రిస్క్‌తో కొంచెం మెరుగైన రాబడి కోరుకునే వారికి ఎస్బీఐ అమృత్ వృష్టి స్కీమ్ ఒక పరిశీలించదగ్గ ఎంపికగా కనిపిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *