Satyaraj: తస్సాదియ్యా.. కట్టప్ప కూతురా మజాకా.. రాజకీయాల్లో సెన్సేషన్ ఈ అమ్మడు..

Satyaraj: తస్సాదియ్యా.. కట్టప్ప కూతురా మజాకా.. రాజకీయాల్లో సెన్సేషన్ ఈ అమ్మడు..


సత్యరాజ్.. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ కట్టప్ప అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన పాత్రతో పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయ్యారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నిటంచారు.దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సత్యరాజ్. హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు విలన్ గా, సహాయ నటుడిగా రాణిస్తున్నారు. దశాబ్దాలుగా సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా మెప్పించిన సత్యరాజ్.. ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్లకు తండ్రి, మామ, తాతయ్య పాత్రలలో కనిపిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సత్యరాజ్ సినిమాలతో జనాలకు దగ్గరైనప్పటికీ తన పర్సనల్ విషయాలు అంతగా బయటపెట్టరు. సత్యరాజ్ కుటుంబం గురించి ఎవరికీ అంతగా తెలియదు. ఆయన కుమారుడు ప్రస్తుతం తమిళంలో నటుడిగా రాణిస్తున్నారు. ఇక కూతురు దివ్య సత్యరాజ్ మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో చేరారు. అంతకు ముందు దివ్య ఫేమస్ న్యూటిషనిస్ట్. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు. జనాలకు అవసరమైన పోషకాహార విషయాలను సైతం వెల్లడిస్తుంటారు.

ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

ప్రస్తుతం దివ్య సత్యరాజ్ డీఎంకే పార్టీలో ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. అటు పోషకాహార నిపుణులుగా ఉంటూనే.. ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *